త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ టైటిల్.. ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న అభిమానులు ముద్దుగా.. గురూజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఎంత ఎత్తుకు ఎదిగిన.. ఎన్ని టెక్నాలజీలు వచ్చిన.. ఎంత ఎక్విప్మెంట్ పెరిగినా సరే తన సెంటిమెంట్ ని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. దానినే ఫాలో అవుతాడు. తన సినిమాలను పాత పద్ధతిలో తీసేందుకే ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం త్రివిక్రమ్ తో పనిచేసే చాలా మంది పలు సందర్భాల్లో వివరిస్తూనే ఉంటారు. ఇక త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో ఓ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

Writer' Trivikram Finding A Balance With 'Director' Trivikram

ఈ సినిమా పనుల్లో ప్రస్తుతం ఆయన బిజీబిజీగా గడిపేస్తున్నాడు. వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్ సినిమాను తీయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్ర‌మంలోనే వెంకీ మామ సైతం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే సినిమాకు తాజాగా ఒక క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారంటు టాక్‌ వైరల్‌గా మారుతుంది. దీన్ని.. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక.. వెంకటేష్‌కి 77వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాను.. సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్‌ సిద్ధం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.. ట్యాగ్ లైన్ కేరాఫ్ ఆనంద నిల‌యం అని పెట్టనున్నారట.

After Sankranthiki Vasthunnam, Venkatesh teams up with Trivikram for a much-awaited family entertainer

త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ లో ఎప్పటికప్పుడు వైవిధ్యతను చూపిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆయన తెర‌కెక్కించిన‌ సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అలవైకుంటపురంలో, చివరిగా వ‌చ్చిన‌ గుంటూరు కారం సినిమా.. ఇలా రకరకాల టైటిల్స్ ను వాడుతూ ఉంటాడు త్రివిక్రమ్జ‌ ఇప్పుడు వెంకటేష్ తెర‌కెక్కించే సినిమా కోసం కూడా.. వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను చూజ్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. తన క్రేజి టైటిల్ హిట్ సెంటిమెంట్‌నే మరోసారి ఫాలో అవుతూ ఈ టైటిల్ లు పెట్టనున్నాడట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా ముగిసిందంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారడంతో టైటిల్ తోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది.