పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్‌ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు సన్నా. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసే ప్లాన్ చేశాడ‌ట‌.

Peddi First Shot: Ram Charan's Cricketer Avatar In Telugu Sports Drama  Movie Is Unstoppable; Release Date Announced

జాన్వి కపూర్ హీరోయిన్గా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధ్ర శర్మ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కుమార్ ప్రొడ్యూసర్ గా.. మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన పోరాట ఘట్టాలను రూపొందిస్తున్న టీం.. స్పెషల్గా తీర్చిదిద్దిన భారీ సెట్స్‌లో ఈ షూట్‌ను జరుపుతున్నారు. ఈ వార్ సీన్స్‌ సినిమాకి హైలైట్ గా నిల‌వ‌నున్నాయట.

Peddi: Ram Charan Plays Cricket In Release Date Glimpse Of Buchi Babu Sana  Directorial

సుదీర్ఘంగా సాగే ఈ స్కెడ్యూల్ తో సినిమా కీలక దశకు చేరుకుంటుందని.. సినీ వర్గలలో టాక్‌ నడుస్తుంది. చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక.. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా, ఆర్. రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బుచ్చిబాబు సన్నా ఈ సినిమాతో చరణ్‌కు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇస్తాడో.. తన మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటాడో.. లేదో.. చూడాలి.