పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ పాలిటిక్స్ లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్స్ అంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 పూర్తి చేసుకున్నాడు. ఈ నేపద్యంలో పవన్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్‌కానుంది. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియో సినిమాకు విపరీతమైన బజ్ నెలకొల్పాయి. కాగా ఈ సినిమా తర్వాత పవన్ ఓజి సెట్స్‌లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాదు.. ఈ ఏడాదిలోనే భోజి సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇలాంటి క్రమంలో అభిమానులకు డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పిన గుడ్ న్యూస్ మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. పవన్ సైన్ చేసిన సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ ఇప్పటివరకు వాయిదా పడుతునే వచ్చింది. ఈ క్రమంలోనే జూన్ రెండవ వారం నుంచి.. ఈ సినిమా షూట్ ను ప్రారంభించనున్నట్లు హరీష్ శంకర్ వెల్లడించాడు.
ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే మొదటిసారి వరుసగా మూడు సినిమాల లైనప్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్.. పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టి.. మార్కెట్‌ను మరింతగా పెంచుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ అభిమానులలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. కచ్చితంగా అలాంటి అన్ని ఎలివేన్స్ను జోడించి ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేయనున్నాడట హరీష్ శంకర్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుందని.. రిపీటెడ్ గా సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతారంటూ టాక్ నడుస్తుంది.