టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్లను కూడా ప్రారంభించి.. వీరమల్లు, ఓజి సినిమాలో షూట్ సగం వరకు పూర్తి చేసేసారు. ఇక తాజాగా ఈ రెండు సినిమాలకు కాల్ షీట్లు కేటాయించి.. వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన పవన్.. ప్రస్తుతం ఓజి సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్‌కు డేట్స్ కేటాయించనున్నాడు.
కాగా.. ఈ నెల 30వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేయనున్నారు టీం. మొదట ఈ సినిమాకు కృష్ దర్శకుడుగా వ్యవహరించుగా.. మధ్యలో అతను తప్పుకోవడంతో ఏ.ఏం. రత్నం కొడుకు జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేశారు. ఇక.. సెప్టెంబర్ లో ఓజి రిలీజ్‌కు టీమ్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో.. మరో 10 రోజుల్లో సినిమాను పూర్తి చేసి ఉస్తాద్ కు కాల్‌షీట్స్ ఇచ్చేల పవన్ ప్లాన్‌లో ఉన్నాడట. ఇక ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకొనుపన్నారని సమాచారం. ఈ క్రమంలోనే పవన్ చివరి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.. హరిష్ శంకర్ చివరి సినిమా దర్శకుడు కానున్నాడు అంటూ సమాచారం.
అయితే.. తనతో సినిమా చేసి పెట్టాలని జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నా.. పవన్ కు అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ చివరి సినిమా కానుందట. రాజకీయల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్న పవన్.. త్వరలోనే నియోజకవర్గ పునర్విభజనలో బిజీ కానున్నారు. సనాతన ధర్మంపై ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల సందర్శించి.. భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి.. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం మరింత కృషి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇలాంటి నేపథ్యంలో సినిమాలు చేయడానికి ఏమాత్రం ఖాళీ లేదని.. దాదాపు ఆయన సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేస్తాడు అంటూ రాజకీయ, సినీ విశ్లేషకుల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.