ప్రస్తుతం ఎక్కడ చూసినా హెచ్‌సీయూ భూముల పరిరక్షణ వివాదం దుమారాం రేపుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమానికి స్వచ్ఛందంగా ప్రజలు.. అలాగే వివిధ రకాల రంగాల నుంచి పలువురు ప్రముఖులు కూడా సంఘీభావం తెలుపుతూ విద్యార్థులకు మద్దతు తెలిపినారు. ఇప్పటికే సినీ తారలు కూడా హెచ్డి ఉద్యమానికి మద్దతుగా.. సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. రేణు దేశాయ్ కూడా చేతులు కలిపారు. హెచ్సీయూ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలుకుతూనే.. రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వీడియోను షేర్ చేసుకున్నారు.
హెచ్సీయూ 400 ఎకరాల పరిరక్షణ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు ప్రకటిస్తున్న రేణు దేశాయ్.. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. నేరుగా రేవంత్ రెడ్డికే కొన్ని విషయాలు చెప్తూ కీలకంగా విజ్ఞప్తి చేశారు రేణు దేశాయ్. నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి.. రెండు రోజుల కింద విషయం తెలిసింది. దాని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఓ తల్లిగా.. మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నా. నా వయసు 44. నేను ఎలాగో కొద్ది సంవత్సరాల్లో పోతా.. మా పిల్లల కోసం.. మన పిల్లల కోసం ఈ విజ్ఞప్తి చేస్తున్న. ఈ ఒక్క 400 ఎకరాలను మాత్రం వదిలేసేయండి అంటూ రేణు దేశాయ్ కామెంట్ చేసింది.
ఏదో ఒకటి ప్రయత్నించి వీటిని దయచేసి కాపాడండంటూ రేణు దేశాయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మనకు నీళ్లు కావాలి, ఆక్సిజన్ కావాలి, అంతేకాదు అభివృద్ధి కూడా కావాలి. ఫ్లై ఓవర్లు, ఐటీ పార్కులు కచ్చితంగా కావాలి. కానీ.. ఈ భూములను మాత్రం వదిలేయండి. సిటిజెన్ గా మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నా. మన నగరాల అభివృద్ధి చెందాలి. నగరాలో అభివృద్ధి ఉంది కనుక ఉంటున్నాం. ఈ 400 ఎకరాలను మాత్రమే వదిలేసి ఆలోచనలు చేయండి. మనకు చెట్లు కావాలి, జీవవైవిద్యం కావాలి. అధికారులు, మంత్రులు దీనిపై మరోసారి ఆలోచించండి. ఒకవేళ పునరాలోచన చేస్తే ఇది సమాజానికి ఎంతో ప్రయోజనాత్మకంగా మారుతుంది అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఒక రేణు దేశాయ్ తో పాటూ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యాంకర్ అనసూయ భరద్వాజ్, డైరెక్టర్ వేణు ఉడుముల, ప్రియదర్శి, ఈషా రెబ్బ, ఫరీయా అబ్దుల్లా తదితరులు హెచ్సియుకు మద్దతు ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో సినీ తారలంతా హెచ్సియు అంశంపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
View this post on Instagram