టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్గా నాగ వంశీ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తరుకెక్కించే ప్రతి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటూ భారీ లాభాలను దక్కించుకుంటున్న నాగ వంశీ.. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నెగటివ్ ప్రచారం జరిగింది. సినిమా బాలేదని.. కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కనుక ఆడుతుంది అంటూ అభిప్రాయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నాగ వంశీ మీడియాపై ఫైర్ అయ్యాడు.
నేడు (ఏప్రిల్ 1) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎన్నడూ లేని విధంగా అసహనం వ్యక్తం చేసిన ఆయన.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజ్ అయిన రోజు వచ్చినా నెగటివ్ ప్రచారం నాకు చాలా ఇబ్బంది కలిగించింది. ప్రెస్ మీట్ ఆరోజే పెట్టా. కానీ.. ఎందుకులే అని ఏమీ మాట్లాడలేదు అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చాడు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అని ఊరుకున్నా. కానీ.. సినిమా ప్రస్తుతం థియేటర్లో మంచిగా రన్ అవుతుంది. అయినా సరే ఆ రివ్యూలు, సోషల్ మీడియాలో నెగిటీవ్ పోస్ట్‌లు మాత్రం ఆపడం లేదు. ఇలాంటివి మరీ ఎక్కువ అవ్వకూడదు కదా అంటూ వంశీ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన నాగవంశీ.. ఇప్పటికీ మా పై పగ ఉంటే.. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి.. నా సినిమాలపై ఆర్టికల్స్ రాయడం మానేయండి.. నా దగ్గర యాడ్లు తీసుకోకండి.. నా సినిమాల రివ్యూ ఇవ్వకండి చూద్దాం.. అంటూ కామెంట్స్ చేశాడు. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెబ్‌సైట్లు రాస్తేనే మా సినిమాలు ఆడట్లేదు కదా అంటూ నాగ వంశీ మండిపడ్డాడు. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు. లేదంటే మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అది గుర్తుపెట్టుకోండి అంటూ నాగ వంశీ మండిపడ్డాడు. నిర్మాతలు, మీడియా కలిసి పనిచేస్తేనే ఇద్దరికీ మంచిదని నాగ వంశీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నాగ వంశీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Naa Cinemalu Ban cheyyandi.. Ads Teesukokandi. Reviews Raayakandi.#NagaVamsi fires on websites & media.. #MadSquare
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 1, 2025