టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలు పాటు ఇండస్ట్రీని ఆయన హీరో గా, దర్శకుడుగా, నిర్మాతగా మల్టీ టాస్క్‌లతో సత్తా చాటుకున్నారు. అంతేకాదు.. నిర్మాతల పాలిట దేవుడిగా మారిన ఆయన.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, భోళా శంకరుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే మొదట కృష్ణకు అసలు సినిమాల్లో రావాలనే ఉద్దేశమే లేదట. ఇంజనీర్ అవ్వాలనుకున్నాడట. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనను అలాగే ప్రోత్సహించేవారట. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసిన ఆయనను సిఆర్ రెడ్డి కాలేజీలో బీఎస్సీ చదువుతున్న సమయంలో.. జరిగిన సంఘటన ఆయన లైఫ్ ను మలుపు తిప్పింది.
కాలేజీలో ఓ హీరో సన్మానం జరగడం.. ఆయన వచ్చినప్పుడు అక్కడ స్టూడెంట్, సభ్యులు.. నినాదాలు ఆయన కోసం ఎగబడ్డడం.. కృష్ణలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఓ హీరోకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అని ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఇంజనీర్ అవ్వాలన్న తన ఆలోచనను అప్పటికప్పుడే మార్చుకున్నారట. పేరెంట్స్ ఆసలకు చెక్ పెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ ఆయన కాలేజీకి వచ్చిన హీరో మరెవరో కాదు ఏఎన్ఆర్. అప్పటికే స్టార్ హీరోగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు దూసుకుపోతున్నారు. అయితే కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ తో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి మరి సినిమాల్లోకి అడుగుపెట్టాడు కృష్ణ.
మద్రాస్ వెళ్లి అక్కడ కొన్ని ప్రయత్నాలు తర్వాత ఏన్‌టిఆర్‌ను కలిసిన కృష్ణ.. యాక్టింగ్ చేయాలని ఉందని ఆయనకు చెప్పడం.. చాలా చిన్నపిల్లాడిలా ఉన్నావ్.. రెండేళ్లు ఆగిన తర్వాత రా అని ఎన్టీఆర్ చెప్పడంతో కొంత గ్యాప్ తీసుకొని సొంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడట. అలా కృష్ణ 1961లో మొదటిసారి కులగోత్రాలు సినిమాలో చిన్న రోల్లో మెరిశారు. తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన.. పరువు ప్రతిష్ట సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి తేనె మనసులు సినిమాతో అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఇక ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా హీరో అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోగా దూసుకుపోయాడు. ఓ రకంగాట్రెండ్ సెంటర్‌గా మారి.. టెక్నికల్ గా ఎన్నో విషయాలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రోజుకు మూడు, నాలుగు షిప్ట్‌లలో సినిమాలు చేస్తూ ఏడాదికి దాదాపు 20, 30 సినిమాలను రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆయన నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా కృష్ణ గారు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.