టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్‌లు అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా రిలీజ్ అయిన పుష్ప 2.. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే బన్నీ క్రేజ్ అంతకు అంతకు పెరుగుతూ పోతుంది. డాన్సులు, డైలాగులు, మేనరిజం ఇలా పుష్ప 2సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా సక్సెస్ కంటే.. సంధ్య థియేటర్ సంఘటన లాంటి సమస్య బన్నీని ఎక్కువగా కుదిపేసింది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. అల్లు అర్జున్ పేరు మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాడట. జ్యోతిష్యుడు సలహా మేరకు.. ఆయన కీర్తి ప్రతిష్టలు, సక్సెస్ ఇలాగే కొనసాగాలన్న సంధ్య థియేటర్ ఇష్యు లాంటి హఠాత్ పరిణామాలు, సమస్యలు ఎదుర్కాకూడదన్న.. న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరు మార్చుకోవడం అవసరమని జ్యోతిష్యుడు సూచించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పేరులో ఎక్స్ట్రా U, ఎక్స్ట్రా Nలను కలపబోతున్నాడని సమాచారం. ఇక ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ సైతం న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను అట్లీ డైరెక్షన్‌లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కోసం అట్లీ భారీ స్థాయిలో పార్లర్ యూనివర్సిటీ స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.Allu Arjun atlee