నందమూరి నటసింహ బాలకృష్ణ సినీ ప్రస్థానంలో.. అఖండతో కొత్త అధ్యయనం మొదలైంది అనడంలో అతిశయోక్తి లేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకని బాలయ్యకు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుస బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు బాలయ్య.
ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన రోజుకు అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక గతంలో బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి.. విద్యాబాలన్ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా అఖండ 2లో విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ టాక్ తెగ వైరల్ గా మారింది.
తాజాగా ఈ వార్తలపై విద్యాబాలన్ టీం స్పందించారు. ఈ సినిమాలో విద్యాబాలన్ నటించడం లేదని.. ఆమెకు అఖండ 2 తో ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో విద్యాబాలన్ అఖండ 2లో నటిస్తుందని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిసిపోయింది. ఇక అఖండ 2లో గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ కీలకపాత్రలో మెరుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమా షూట్‌ను మే నెలఖరుకి పూర్తి చేసి.. సెప్టెంబర్ 25 కు దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.