టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ తో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్ తన 16వ సినిమా షూట్లో బిజీగా గడుతున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేశారు టీం. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ టైటిల్ను అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించి.. ఫ్యాన్ కు ఫుల్‌మీల్ పెట్టాలని కసితో నటిస్తున్నాడట చరణ్. ఈ సినిమాలో చరణ్ ఫుల్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు.
చరణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో మరువనున్నారు. అయితే చరణ్ పుట్టినరోజున గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అంత భావించారు. కానీ.. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో అది వాయిదా పడ్డింది. తాజాగా.. ఉగాది సెలబ్రేషన్స్ లో భాగంగా గ్లింప్స్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా ఫస్ట్ గ్లింప్స్ శ్రీరామనవమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
దీంతో ఫాన్స్ లో గ్లింప్స్ పై ఆసక్తి నెలకొంది. అయితే.. తాజాగా టీం చరణ్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. ఆడియో రైట్స్‌ని.. టి సిరీస్ బ్యానర్ ఏకంగా రూ.35 కోట్లకు సొంతం చేసుకుందని పేర్కొన్నారు. చరణ్, రెహమాన్ కాంబినేషన్‌లో ఇదే మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా రంగస్థలం లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో పిచ్చ క్రేజ్ నెలకొంది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చరణ్.. ఈ సినిమాలో ఫ్యాన్స్‌కు కావలసిన మాస్ ఎలిమెంట్స్‌ని చూపించి ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.