టాలీవుడ్ యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రూపొందునున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు తారక్ ఇంకా సెక్స్ లోకి కూడా అడుగు పెట్టలేదు. అయితే.. తాజాగా సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అప్డేట్స్ లోడ్ అవుతున్నాయి అంటూ.. క్రేజీ వార్త వైరల్ గా మారుతుంది.
ఇక చివరిగా దేవరతో సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న తారక్.. ఇప్పటికే బాలీవుడ్ లో తన ఫస్ట్ మూవీ వార్ 2 షూటింగ్లో పాల్గొని సందడి చేశాడు. ఇక ఇది చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడట. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రానున్న ఈ సినిమా షూట్‌లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు, ఎన్టీఆర్‌కు సంబంధించిన స్పెషల్ అప్డేట్ వస్తే బాగుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తున్నా ఓ గుడ్ న్యూస్ రానే వచ్చేసింది. సినిమా అసిస్టెంట్ డైరెక్టర్‌లలో ఒకరు ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్, నీల్ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం పిక్స్ చేసేసారట. ఎన్టీఆర్ ,నీల్ మూవీ ఫస్ట్ లుక్‌ను.. మే 20 న టైటిల్ అనౌన్స్మెంట్‌తో పాటు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీనిపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్లో దేవర ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ సినిమా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది.