సీనియర్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హిందీలోనే కాకుండా సౌత్‌లోను తెలుగు, తమిళ, కన్నడ భాషలో నటించి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే గతంలో తాను సౌత్‌లో నటిస్తున్న సమయంలో ఎదురైన చేదు అనుభవం స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభవంతులైన వ్యక్తులు ఉన్నారని.. సౌత్ ఇండస్ట్రీ ఎంతో గొప్పదంట చెప్పుకొస్తున్నారు.
అయితే గతంలో.. బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో నటించడం అనేది చాలా రేర్ గా జరుగుతూ ఉండేది. అలాంటి వారిలో సోనాలి బింద్రే ఒకటి. తాజాగా.. సోనాలి బింద్రే సౌత్ ఇండస్ట్రీలో తనుకు ఎదురైన అనుభవం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అది చర్చినీయింశంగా మారింది. అమెజాన్ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి బింద్రే.. కన్నడ ఇండస్ట్రీలో తనకు ఒక చేదు అనుభవం ఎదురయిందని.. కొన్ని తెలుగు సినిమాల్లో నటించా.. మధ్యలో ఒకే ఒక కన్నడ సినిమాలో చేశా అంటూ వివరించింది.
కానీ ఆ సినిమాలో నాకు ఎదురైన చేదు అనుభవంతో నేను మళ్ళీ కన్నడలో నటించకూడదని ఫిక్స్ అయ్యా.. ఆ సంఘటన తర్వాత మళ్లీ ఎప్పుడు కన్నడ సినిమాల్లో నటించలేదు అంటూ సోనాలి బింద్రే వివరించింది. అయితే తనకు ఎదురైన చేదు అనుభవం ఏంటి అనేది మాత్రం తాను రివిల్ చేయలేదు. ఇక కన్నడలో సోనాలి బింద్రే నటించిన ఏకైక మూవీ ప్రీత్సే. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర హీరోలుగా నటించారు. ఆ సినిమా షూట్ టైంలోనే తనకు చేదు అనుభవం ఎదురైందంటూ సోనాలి వివరించింది.