తెలుగు హీరోయిన్ అంజలి పేరుకే తెలుగమ్మాయి కానీ పాపులారిటీ మొత్తం తమిళంలోనే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలోని రాజోలు అమ్మాయి అయినా అంజలి రాజమహేంద్రవరంలో చదువుకుంది .. ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడ సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది ప్రారంభంలో అంజలికి తెలుగు కంటే తమిళంలోని ఎక్కువ పాపులారిటీ వచ్చింది .. ఆ తర్వాత ఆమె తెలుగులో అవకాశాలు సొంతం చేస్తుంది. తమిళంలో చాలా పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది .. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా అంజలి నటించింది ..
అంజలి పేరు చెప్పగానే ఆమె బ్రేకప్ స్టోరీ కూడా అందరికీ గుర్తుకొస్తుంది .. గతంలో అంజలిని ప్రేమ పేరుతో ఓ హీరో మోసం చేశాడు అన్న పుకార్లు ఉన్నాయి ఆ హీరో ఎవరో కాదు తమిళనాడు హీరో జై అనే పేరు తెలుగువారికి తెలియకపోతే జర్నీ సినిమాలో అంజలికి జోడిగా నటించిన హీరో అంటే అందరికీ గుర్తుకు వస్తుంది .. కోలీవుడ్ హీరో జై అంజలి కాంబినేషన్లో వచ్చిన సినిమా జర్నీ ఈ సినిమా షూటింగ్ టైంలో ఏర్పడ్డ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మరి ఇద్దరు కలిసి కోన్నీ ఏళ్ల పాటు సహజవనం కూడా చేశారు .. చివరికి అంజలికి బ్రేకప్ చెప్పి జై తన దారి తను చూసుకున్నాడని కోలీవుడ్ మీడియా ప్రచారం చేసింది ..
అంజలితో రిలేషన్ లో ఉన్న సమయంలో ఆమెతో సినిమాలు చేసే డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా జై కొన్ని కండిషన్లో పెట్టేవారట .. ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలంటే ముందుగా జై పరిమిషన్ తీసుకునేవారట .. అవుట్డోర్ షూటింగ్లోకి వెళ్ళినా కూడా అంజలి తో పాటు జై కూడా వచ్చేవారట ఆయన ఖర్చులు కూడా నిర్మాతలు భరించేవారట .. చివరకు జై మితిమీరిన జోక్యం చేసుకొని అంజలి నటించాల్సిన కొన్ని హిట్ సినిమాలు కూడా ఆమెకు దక్కకుండా చేశారట .. కథలు కూడా ముందుగా జై విని ఓకే చేయాల్సి వచ్చేదట చివరకు అంజలి సంపాదించిన డబ్బులు కూడా చాలా వరకు జైకు ఇచ్చేదట .. ఇలా జై పెట్టే కండిషన్లతో విసిగిపోయిన అంజలి ఎన్నో ఇబ్బందులకు గురైంది .. చివరకు జై అంజలిని అన్ని విధాల వాడుకుని బ్రేకప్ చెప్పాడని అంటారు ..