టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా, ఎంత బడా ప్రాజెక్టు అయిన తనకు కంటెంట్ నచ్చి.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే ఆ సినిమాలో నటించనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుందని టాక్. అంతేకాదు డి గ్లామరస్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. తన వ్యక్తిత్వంతోను ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.
ఇక ఇటీవల సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ అమరాన్, తండేల్ సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి పల్లవి లాంటి నేచురల్ బ్యూటీతో నటించాలని చాలామంది భావిస్తారు. కాగా స్టార్ హీరోలను సైతం రిజెక్ట్ చేసే సాయి పల్లవిని సైతం ఓ తెలుగు హీరో రిజెక్ట్ చేశాడంటూ న్యూస్ నెట్టింట వైరల్ గా మారిపోతుంది.ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అందుకోకపోయినా.. యూత్‌ను మాత్రం ఆకట్టుకుంటాయి. విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
అయితే దేవరకొండ నుంచి వచ్చిన చివరి మూవీ ది ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ కన్నా ముందు సాయి పల్లవిని భావించారట. సాయి పల్లవి సినిమా చేస్తుంది అన్న టాక్ కూడా అప్పట్లో ఎక్కువగా నడిచింది. అయితే.. విజయ్ దేవరకొండ మాత్రం సాయి పల్లవికి నో చెప్పేసాడట. ఎంత ఫ్యామిలీ డ్రామా అయినా కొన్ని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండాల్సిందే. అలా ఉంటేనే సినిమా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉంది. అది ఖచ్చితంగా ఆమె చెయ్యదు. అడిగి నో అనిపించుకోవడం కన్నా.. ముందే మనమే వద్దనుకుంటే మంచిదని విజయ్ దేవరకొండ సాయి పల్లవిని రిజెక్ట్ చేశాడట. ఈ క్రమంలోనే సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండగా ఘనత సాధించాడు.