సీనియర్ స్టార్ హీరోయిన్ టబు గురించి టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ తెలుగు సోయగం.. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. నార్త్, సౌత్ లోనూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. దాదాపు తను ఎంచుకునే ప్రతి కథలోను మంచి కంటెంట్ ఉండేలా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో పోల్చితే టబ్బు సినిమాలు చాలా వరకు సక్సెస్ అందుకున్నాయి. దీంతో అమ్మడు ఈ ముదురు వయసులోనూ వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ రాణిస్తుంది.
ఇక ఐదు పదుల వయసు వచ్చిన టబ్బు ఇప్పటివరకు వివాహం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. గతంలో ఎంతో మంది హీరోలతో అఫైర్లు కొనసాగాయంటూ రకరకాల వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, టబ్బు చాలా కాలం పాటు రిలేషన్ లో ఉన్నారని.. పీకల్లోతు ప్రేమాయణం నడిచింది అంటూ వార్తలు వినిపించాయి. నిన్నే పెళ్లాడతా సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా షూట్ టైంలోనే వీరిద్దరి మధ్యన మంచి స్నేహం ఏర్పడిందని.. అది కాస్త ప్రేమగా మారి.. వీళ్లిద్దరు వివాహం చేసుకోవాలని భావించాతంటూ కూడా టాక్ నడిచింది.
అయితే వీరిద్దరూ ప్రేమ, పెళ్లి వార్తలకు చెక్ పడడానికి ఓ లేడీ ఎంట్రీ ఇవ్వడమే కారణం. ఆమె మరెవరో కాదు నాగార్జున భార్య అమల. ఇక టబ్బుతో ఎఫైర్ వార్తలపై నాగార్జున ఓ సందర్భంగా రియాక్ట్ అయ్యాడు. వారిద్దరి మధ్య కేవలం మంచి స్నేహం మాత్రమే ఉందని.. అంతే కాదు టబ్బుకి, అమలాకి మధ్యన కూడా మంచి బాండ్ ఏర్పడిందని.. ఈ క్రమంలోనే అమల, టబ్బును ఇంటికి పిలిచి మరీ చాలా బాగా చూసుకుందని.. నాగార్జున వెల్లడించాడు. తర్వాత ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పటికీ నాగార్జున హీరోగా పలు సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క టబ్బు కూడా.. సినిమాల్లో కీరోల్స్‌లో నటిస్తూ ఆకట్టుకుంటుంది.