సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఎఫైర్లు, ప్రేమలు , పెళ్లిళ్ల వార్తలే కాదు.. దర్శక నిర్మాతలకు, హీరోలకు మధ్య ఏ చిన్న హింట్ దొరికిన సరే వారి కాంబోలో సినిమా వచ్చేస్తుంది అంటూ ఊహగానాలు వినిపిస్తూ ఉంటారు నెటిజన్స్. అలా ఎంతోమంది స్టార్ హీరోల కాంబోలో.. స్టార్ దర్శకులతో సినిమాలు వస్తున్నాయని వార్తలు వినిపించిన అవి వర్కౌట్ కాలేదు. అలా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. దర్శకనిర్మాతలతో కొన్ని సినిమాలు రాబోతున్నాయని గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే వాటిలో కొన్ని పుకార్లు కాగా.. కొన్ని ఏమో అనివార్య కారణాలతో ఆగిపోయిన సినిమాలు. ఇంతకీ అలా రామ్ చరణ్‌ను హీరోగా అనుకొని ఆగిపోయిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
మెరుపు
రామ్ చరణ్.. ఆరెంజ్ సినిమా తర్వాత మెరుపు సినిమాలో నటించాల్సింది. స్పోర్ట్స్ డ్రామాగా తమిళ్ డైరెక్టర్ ధరణి ఈ ప్రాజెక్టును ఫిక్స్ చేశారు. కాజల్ కూడా హీరోయిన్గా అనౌన్స్ చేశారు. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
గౌతం తిన్ననూరి ప్రాజెక్ట్:
చరణ్ హీరోగా గౌతం తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమాను భావించారు. ఇది అఫీషియల్ గా అనౌన్స్ కాకున్నా వార్తలు తెగ వినిపించాయి. కానీ.. సినిమా సెకండ్ పార్ట్ చరణ్ కి నచ్చలేదని.. కొన్ని మార్పులు, చేర్పులు చేసినా.. చరణ్ అంగీకరించలేదని సమాచారం.
కొరటాల శివ ప్రాజెక్ట్:
కొట్టాల శివ డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు. కానీ.. పూజ కార్యక్రమాలు కూడా జరిగిన తర్వాత ఏవో కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది.
మణిరత్నం
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా నటించాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అలాగే చరణ్ మణిరత్నం సినిమాలో కూడా ఓ సినిమా వస్తుందంటూ వార్తలు వినిపించాయి కానీ.. అఫీషియల్‌గా బయటకు రాలేదు. అయితే వీరిద్దరి కాంబోలో ఓ యాక్షన్ డ్రామా రాబోతుందని టాక్ నడిచింది. కానీ.. ఇది సెట్స్ పైకి వెళ్ళలేదు.
త్రివిక్రమ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, చరణ్ కాంబోలో సినిమా వస్తుందని టాక్ నడిచింది. నిర్మాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది అఫీషియల్ టాక్ కాదు.
ఏ ఆర్ మురుగదాస్
రామ్ చరణ్ ఓ ఫంక్షన్ లో మురుగదాస్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉందంటూ వెల్లడించాడు. దీనిపై అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రానుంది అంటూ టాక్ నడిచింది. అయితే.. దీనిపై అప్పట్లో వార్తలు గట్టిగా వినిపించాయి. ఇది కూడా సెట్ పైకి రాలేదు.