టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సంచలనంతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్ని నెక్స్ట్ మూవీ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మొదట త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ ఓ సినిమా నటించబోతున్నాడని టాక్ నడిచింది. అయితే.. ఈ సినిమా కథ పూర్తిగా ప్రిపేర్ కాలేదని త్రివిక్రమ్ దీనికోసం మరికాస్త సమయం తీసుకుంటున్నాడట. కనీసం 6 నెలల సమయం పడుతుందని.. ఈ లోపు తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో సినిమా ప్రారంభిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచనలో బన్నీ ఉన్నట్లు సమాచారం. కారణం.. పుష్ప సీరీస్ల కోసం ఇప్పటివరకు వేచించిన సమయాన్ని అంత ప్రస్తుతం నటించబోయే సినిమాలతో కవర్ చేసేయాలని బన్నీ భావిస్తున్నాడట.
ఈ క్రమంలోనే ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని.. కుదరకపోతే ఎట్లిస్ట్ ఒక సినిమా అయినా ఏడాదిలో తన నుంచి రిలీజ్ అయ్యేలా భావిస్తున్నాడని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఆయన అట్లీతో మొదట సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నటించబోయే సినిమాపై అప్డేట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాకు రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్నాడని టాక్. ఇక అల్లు అర్జున్ లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభయంకర్‌ని ఎంచుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే.. ఈ సినిమా కోసం జాన్వి కపూర్‌ని హీరోయిన్గా సెలెక్ట్ చేస్తున్నారని టాక్. బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జాన్వి.. టాలీవుడ్ లో దేవరతోను స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది.
ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోవడంతో.. కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సైతం జాన్వికపూర్‌తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే.. చరణ్, బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ఫిక్స్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. బన్నీ, అట్లి ప్రాజెక్టులో కూడా జాన్వి కపూర్ హీరోయిన్ కానుందట. పుష్ప 2 సినిమా కిసిక్ పాటకు జాహ్నవి అడిగారని.. కానీ ఆమె ఐటెం సాంగ్ చేయనని ఫుల్ లెన్త్ క్యారెక్టర్ రోల్ అయితేనే నటిస్తానని చెప్పేసిందట. ఇప్పుడు ఆమె అంచనాలే నిజమయ్యాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, అట్లీ కాంబోలో.. జాన్వి కపూర్ హీరోయిన్ అంటూ టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మూవీ టీమ్ అంతా పనిచేయనున్నారని.. మళ్ళీ అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ బన్నీకి అందించేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని.. ఏడాది చివరి క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.