మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు .. వారిలో జగపతిబాబు కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు .. తెలుగు ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ కొడుకు అయినా జగపతిబాబు ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో దూసుకుపోతున్నారు. తన గొంతు బాలేదని డబ్బింగ్ సెట్ కాదనే స్థాయి నుంచి తన వాయిస్ బెస్ట్ అనే స్థాయికి జగత్ బాబు ఎదిగారు . అంతటి పేరు తెచ్చుకున్నారు .. తనకు ఉన్న నెగటివ్ నే పాజిటివ్గా మార్చుకొని స్టార్ హీరోగా రాణించారు. ప్రస్తుతం ఇండియన్ చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బలమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు ..
అలాగే విలక్షణ నటుడుగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నా .. ఇలాంటి జగపతిబాబు తనకు సంబంధించిన రహస్యాన్ని రీసెంట్గా బయటపెట్టారు .. చిత్ర పరిశ్రమలో తన స్నేహం గురించి చెప్పుకొచ్చారు .. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ? అనే ప్రశ్నకు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జగతిబాబు మాట్లాడుతూ యాక్షన్ కింగ్ అర్జున్ పేరు చెప్పారు .. అయితే ఆయన కంటే ఓ హీరోయిన్ తో స్నేహం ఎక్కువగా ఉందని కూడా ఆయన చెప్పకు వచ్చారు. సాధారణంగా అంతా సౌందర్య అనుకుంటారు కానీ ఆమె కాదట రమ్యకృష్ణ తనకు మంచి ఫ్రెండ్ అని ఆయన చెప్పారు ..
అలాగే జగతిబాబు, రమ్యకృష్ణ .. ఇద్దరూ ఒకేసారి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.. అలాగే ఇద్దరు నంది అవార్డు కూడా ఒకేసారి తీసుకున్నారు .. తనతోనే ఎక్కువగా స్నేహంగా ఉండేవారిని బెబెస్ట్ కంపానియన్ అని కూడా జగపతిబాబు వెల్లడించారు. అలాగే జగత్ బాబు – రమ్యకృష్ణ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి .. వీరి కాంబినేషన్లోఅల్లరి ప్రేమికుడు`, కుషీకుషీగా, ఆయనకు ఇద్దరు, బాలరామకృష్ణులు, చిలక్కొట్టుడు, జైలర్‌గారి అబ్బాయి, శివకాశీ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇలా జగతిబాబు , సౌందర్య కంటే తనకు రమ్యకృష్ణ నే ఇష్టం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.