కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా .. చిత్ర పరిశ్రమలో ఇద్దరూ సూపర్ స్టార్లే.. మన సౌత్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు .. ఇద్దరి హీరోల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చుంటే ఓ రేంజ్ లో ఉండేది .. ఇది చెప్పడానికి చాలా క్రేజీగా ఉంది.. కానీ గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో నటించి ఉంటే ఎంతో బాగుండేది.. అభిమానులకు కూడా ఎంతో పండగ చేసుకునే వారు .. అలాగే బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు ఉండేవి. ఇద్దరు కాంబోలో సినిమా వచ్చి ఉంటే బాగుండేది అని చాలామంది అభిమానులు అనుకుంటారు ..
కానీ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా మిస్ అయింది అనే విషయం చాలామందికి తెలియదు .. అయితే సోషల్ మీడియాలో ఇదే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు కానీ .. ఈ ఇద్దరు సూపర్ స్టార్ల కాంబినేషన్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా అయితే మిస్ అయిందట .. ఆ సినిమా మరేదో కాదు మాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటైన జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ , మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హీట్ అందుకుంది .. అలాగే అప్పట్లో ఎన్నో సంచల రికార్డులు కూడా క్రియేట్ చేసింది .. అయితే ఈ సినిమాని ముందుగా దర్శకుడు కొరటాల శివ , మహేష్ బాబుతో చేయాలని భావించారట ..
అప్పటికే మహేష్ తో కొరటాల శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించాడు .. ఈ సినిమాని కూడా మహేష్ బాబుతో చేయాలని కొరటాల భావించారు .. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ కొరటాల జనతా గ్యారేజ్ కి కథను ముందుగా మహేష్ బాబుకి వినిపించాడట. అయితే మహేష్ బాబుకు ఈ కథ నచ్చక రిజెక్ట్ చేశారని అంతే కాకుండా మహేష్ బాబు .. ఈ సినిమాను ఓకే చేసి ఉంటే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ చేసిన పాత్రకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను తీసుకోవాలని అప్పుట్లో ప్లాన్ చేశారట. కానీ కొరటాల అనుకొన్నది జరగలేదు .. దాంతో ఈ సినిమాని ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబోలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయమందుకున్నారు .. ఇలా మహేష్ , రజనీకాంత్ కాంబినేషన్లో ఈ సినిమా మిస్ అయింది అని అంటున్నారు.