రాజమౌళి సినిమాల్లో చరణ్, ప్రభాస్ ఇద్దరికీ నచ్చని ఏకైక మూవీ అదేనా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తెర‌కెక్కించిన‌ పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ దర్శకుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకులుగా సక్సెస్ సాధించాలంటే స్టార్ హీరోలను పెట్టి వారితో సక్సెస్ కొట్టాల్సిన అవసరమే లేదు.. ఈగను పెట్టి కూడా సినిమా తీసి సక్సెస్ఫుల్గా హిట్ అందుకోవచ్చు అనే ఛాలెంజ్ చేసి చూపించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారంటే ఆ క్రెడిట్‌ రాజమౌళిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే జక్కన్న తన నెక్స్ట్ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు.

Student No.1 Movie (2001): Release Date, Cast, Ott, Review, Trailer, Story,  Box Office Collection – Filmibeat

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఏకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ మూవీ ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇక ఏదేమైనా రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి గర్వకారణం. ఈ నేప‌ధ్యంలోనే రాజమౌళి.. జేమ్స్ కెమరున్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక రాజమౌళి ఓ సినిమాలో తెరకెక్కిస్తున్నాడంటే దాని కోసం ప్రాణం పెట్టేస్తాడు. కాగా తాజాగా మహేష్ బాబుతో తాజాగా SSMB 29 షూట్ స్టార్ట్ అయినా.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు తెలియకుండా స్ట్రిక్ట్‌ రూల్స్ పెట్టాడు.

Prabhas-Ram Charan for the biggest collaboration | cinejosh.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే రాజమౌళి కెరీర్‌లో ఆయన తెర‌కెక్కించిన కొన్ని సినిమాల్లో.. రెబల్ స్టార్ ప్ర‌భా్‌కు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఒక సినిమా అంటే అసలు నచ్చదట. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్కు నచ్చని రాజమౌళి ఏకైక మూవీ మరేదో కాదు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన‌ స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమాలో హీరో జైల్లో ఉండి ఎల్.ఎల్.బి పూర్తి చేస్తాడు. ఆ కాన్సెప్ట్ ఎందుకో చరణ్, ప్రభాస్ ఇద్దరికీ అసలు నచ్చలేదట. పెద్దగా కంటెంట్ కనెక్ట్ కాలేదట. ఇక మొదట రాజమౌళి ఈ కథను ప్రభాస్ తోనే తెరకెక్కించాలని భావించాడట. ప్రభాస్ కథ నచ్చకపోవడంతో సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమా కనెక్ట్ కాలేదట. రాజమౌళి కారణంగా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఇద్దరికీ.. ఆయన తీసిన సినిమాల్లో ఒకే సినిమా నచ్చకపోవడం నిజంగా అంద‌రికి ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.