స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా దశాబ్ధకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత మయోసైటిస్తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు వెబ్ సిరిస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఈ అమ్మడి నుంచి దాదాపు తెలుగు సినిమా వచ్చి రెండు ఏళ్ళు గడిచిపోయింది. అయినప్పటికీ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా టాలీవుడ్‌లో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక.. సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంటుందన్న సంగతి తెలిసిందే.
అలా నిన్న సాయంత్రం instagram వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ అమ్మడు ఇందులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నారా.. అనే ప్రశ్నకు చూస్తున్న అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆమెకు ఫేవరెట్ హీరోయిన్లు ఎవరు అనే ప్రశ్నకు.. పార్వతి తిరువోతు, సాయి పల్లవి, నజ్రియా ,అలియా భట్, అనన్య పాండే, దివ్య ప్రభ వీళ్లంతా రాక్సస్టార్స్.. ఇంకెవరైనా మర్చిపోయుంటే.. మళ్ళీ ఇంకో వీడియో చేస్తా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. నెగిటివ్ ఆలోచనలను ఎలా కంట్రోల్ చేసుకుంటారని ప్రశ్నకు.. దానికోసం నేను స్పెషల్ గా ఏం చేయను.. రెగ్యులర్గా చేసే మెడిటేషన్ కారణంగానే నాకు నెగెటివిటీ దూరమవుతుందంటూ వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఓ అభిమాని సమంతకు తిరిగివచ్చేయండి.. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ కామెంట్స్ చేశాడు. అంటే టాలీవుడ్ లో మళ్ళీ అడుగుపెట్టి వరస సినిమాలతో బిజీగా గడపాలని అతని ఉద్దేశం. ఈ క్రమంలోనే సమంత తప్పకుండా తిరిగి వస్తాను బ్రో అంటూ సమాధానం ఇచ్చింది. ఇక తాజాగా.. లైఫ్ లో మీరు నేర్చుకున్న పాఠం ఏంటి అనే ప్రశ్న కొన్ని రోజులు ఫోన్‌కు పూర్తిగా దూరంగా ఉన్నా.. మొబైల్ లేకపోతే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్న ఫీల్.. ఎంతగా దానికి ఎడిక్ట్ అయ్యానో నాకు అప్పుడే అర్థమైంది అంటూ వివరించింది. ప్రస్తుతం సమంతతో అభిమానులు చేసి ఈ క్రేజీ చిట్ చాట్ లో.. సమంత కచ్చితంగా తిరిగి వస్తాను బ్రో అని చేసినా కామెంట్స్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.