మహేష్ కు రాజమౌళి షాకింగ్ ట్విస్ట్.. టార్చర్ తప్పేలా లేదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో ను పిండి పిప్పి చేస్తాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్రస్తుతం మహేష్ బాబుతో ఏకంగా ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్టును ప్లాన్ చేశాడు జక్కన్న. దీంతో మహేష్ బాబుకు జక్కన్న చేతిలో టార్చర్ తప్పదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూట్ చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది.

ఈ క్రమంలోనే సినిమాకు కు సంబంధించిన ఏ చిన్న లీక్‌, అప్డేట్ కూడా బయటకు రాకుండా ఎంతో గోప్యంగా ఉంచుతున్నాడు. అంతే కాదు టీమ్ మ‌త్తానికి ఈ విష‌యంపై స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు స‌మాచారం. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాపై అఫీషియల్ అప్డేట్స్ జక్కన్న ఎప్పుడెప్పుడు తెలియజేస్తాడా అంటూ.. ఫ్యాన్స్ అంత కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక‌ సినిమాకు సంబంధించి రోజు ఏదో ఒక‌ రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక జక్కన్న సినిమా కోసం రంగంలోకి దిగాడంటే.. ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. నిద్ర హారాలు మానేసిమరి సినిమా కోసం కష్టపడతాడు. ప్రతి సన్నివేశాన్ని చెక్కుతూ ఉంటాడు.. ఆయనతోపాటు టీంని కూడా పరుగులు పెట్టిస్తాడని.. ఇప్పటికే ఆయ‌న‌తో పనిచేసిన ఎంతో మంది స్టార్ హీరోస్ వివరించారు.

ఓ విధంగా చెప్పాలంటే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. జక్కన్నతో సినిమా ఒప్పుకున్న తర్వాత ఫుల్ గా సెరండ‌ర్‌ కావాల్సిందే. ఇదంతా తెలిసే మహేష్ బాబు జక్కన్నతో సినిమాకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబు లుక్ చేంజ్ దగ్గర నుంచి స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైనింగ్ వరకు అన్నిటిలోనూ పరుగులు తీప్పిస్తున్నాడు. 50 ఏళ్ల వయసులోనూ మహేష్ ఎంతగానో కష్టపడుతున్నారు. ఇక సినిమా పాన్ వ‌ర‌ల్డ్‌ మూవీ కావడంతో.. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వాన్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న క్ర‌మంలో.. అక్కడ ట్రైబ్స్ ను బేస్ చేసుకుని చేస్తున్న సినిమా కావడంతో.. మహేష్ కు అనుకున్న దానికంటే.. మరింత కష్టమవుతుందట. షూటింగ్ ప్రారంభంలోనే ఇంతలా కష్టంగా ఉంటే.. మూవీ పూర్త‌య్యేస‌రికి జ‌క్క‌న మహేష్‌ను ఇంకా ఎంతలా టార్చర్ చేస్తాడో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.