టాలీవుడ్‌లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ డైరెక్టర్‌గా దిల్ రాజుకు మంచి ఇమేజ్ ఉంది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోలతో తప్ప దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమాలను తెరకెక్కించిన దిల్ రాజు.. తక్కువ బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలన్నీ ఆల్మోస్ట్ భారీ సక్సెస్ అందుకున్నాయి. అంతేకాదు.. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి సంచలనం సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. కానీ స్టార్ హీరోల కాంబినేషన్స్‌లో సెట్ చేసిన సినిమాలతో మాత్రం చేతులు కాల్చుకున్నాడు దిల్ రాజు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఏడాది సంక్రకాంతికి వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు భారీగా డబ్బులు ఖర్చు చేసి తెరకెక్కించిన దిల్ రాజు.. ఏకంగా 300 కోట్లకు పైగా బడ్జెట్ను ఖర్చు పెట్టాడు.
అయితే సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో రూ.200 కోట్ల వరకు లాస్ వచ్చింది. అదే సమయానికి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ చేయడం.. సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అనుకోవడంతో.. గట్టెక్కాడు. అయితే గేమ్ ఛేంజర్ కంటే ముందే.. దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబోలో రామయ్య వస్తావయ్య సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఈ సినిమా కూడా గేమ్ ఛేంజర్ లాగా.. భారీ కాంబినేషన్‌లో తెరకెక్కింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత.. హరీష్ శంకర్ చేసిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా.. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. కానీ.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఈ సినిమా.. ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది.
మొదటిరోజు వచ్చిన భారీ ఓపెనింగ్స్ తప్ప.. రెండో రోజు నుంచి చిల్లర వసూళ్లే వచ్చాయి. కనీసం.. రూ.30 కోట్ల వరకు కూడా సినిమా షేర్ రాబట్ట లేకపోయింది. అయితే తాజాగా సినిమా రిజల్ట్ పై దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. రామయ్య వస్తావయ్య సినిమా ప్లాప్ వచ్చినప్పుడు.. ఎన్టీఆర్, నన్ను.. హరీష్ శంకర్ ని ఇంటికి పిలిచారని.. మధ్యాహ్నం రెండు గంటలకు మేమిద్దరం వెళ్ళాం. ఇక మూడు గంటలకు మేము మాట్లాడుకోవడానికి కూర్చున్నాం. అప్పటికే మా ముగ్గురికి సినిమా రిజల్ట్ అర్థమయింది. ఎందుకు సినిమా ప్లాప్ అయింది.. అసలు ఎందుకు ఇలాంటి సినిమా తీశామని దాదాపు 6 గంటలు మాట్లాడుకున్నాం. హరీష్ శంకర్ తాను చేసిన పొరపాట్లు అర్థం చేసుకున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ కూడా హరీష్ శంకర్ కు ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చేసుకోమని క్లాస్ పీకడు. అలా నాలుగు గోడల మధ్య మా చర్చ చాలా సేపు కొనసాగింది. ఈ సినిమా తర్వాత.. నాకు.. తారక్ తో మళ్ళీ సినిమా చేసే అవకాశమే దక్కలేదు. ఆయనకు చాలా బాకీ పడ్డ త్వరలోనే తీర్చుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు దిల్‌రాజు.