బన్నీ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం.. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యమేనా..?

అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన పుష్ప సిరీస్‌ల‌తో సాలిడ్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ క్రమంలోనే బ‌న్ని నెక్స్ట్ న‌టించే సినిమా బడ్జెట్ లెక్కల పై.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మైథలాజికల్ టచ్ మూవీలో బన్నీ నటించనున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైలాగు వెర్షన్ జరుగుతుంది. దీంతోపాటు.. సినిమాకు టెక్నీషియన్స్, సీజీ వర్క్, ఇతర పనులకు ఎవరైతే బెస్ట్ అనే డిస్కషన్లు కొనసాగుతున్నాయి.

కాగా ఈ సినిమా కన్నా ముందుగా.. రిలీజ్ చేయడానికి వీలుగా మరో సినిమా చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసమే సన్ పిక్చర్ బ్యానర్ పై అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. అంతవరకు బానే ఉన్నా.. అది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు. దానికి కారణం.. బడ్జెట్ లెక్కలు తేలకపోవడమే అని సమాచారం. పుష్ప 2 కోసం బన్నీ.. టోటల్ మార్కెట్ అమౌంట్ లో 27% తీసుకున్నాడని తెలుస్తుంది. అంటే.. దాదాపు రూ.250 కోట్లు. కానీ అట్లితో తెర‌కెక్కించబోయే సినిమాకు ఎంత తీసుకోవాలని సందేహం ఉంది. అట్లీ కూడా పాన్‌ ఇండియన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లకు చేసే అవకాశం ఉంది.

Allu Arjun & Atlee's Film Update: From Rumours About Samantha Or Trisha As  The Leading Lady To A Monstrous Budget

బన్నీకి రూ.250 కోట్లు, అట్లికి రూ.100 కోట్ల రెమ్యున‌రేషన్‌లు ఇస్తే.. అక్కడే రూ.350 కోట్ల వరకు అయిపోతుంది. ఇక ప్రొడక్షన్ ఖర్చులు, మార్కెట్ లెక్కలు.. ఇవన్నీ వేరే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బడ్జెట్ డిస్కషన్లు హాట్ గా కొనసాగుతున్నాయని.. ఈ లెక్కలన్నీ ఒకసారి ఫిక్స్ అయితే ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోతుందని సమాచారం. దీంతో.. విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పుష్ప 2 కి మించి ఉంటుందని సమాచారం. మరి ఆ రేంజ్ లో సినిమా రావాలంటే.. దానికి తగ్గట్టుగా నిర్మాతలు ఖర్చు చేయగలరా.. లేదా.. అలాంటి నిర్మాతలు దొరుకుతారా.. అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. వీటికి సమాధానం తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి.