మహేష్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చరణ్ మూవీ.. చెర్రీని డెవిల్‌గా చూపించనున్న సందీప్ రెడ్డి వంగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీతో మరో సినిమాను కమిట్ అయ్యాడు సందీప్. ఇక వీరిద్దరి కాంబోలో 2027లో సినిమా సెట్స్‌ పైకి వచ్చే ఛాన్స్ ఉందట. అయితే బన్నీ కంటే ముందే.. చ‌ర‌ణ్‌తో మరో సినిమా సందీప్ రెడ్డి వంగ కమిట్ అయ్యాడంటూ టాక్ నడుస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత.. మహేష్ బాబుకు ఓ కథ వినిపించాడట సందీప్.

Sandeep Reddy Vanga says Prabhas starrer 'Spirit' will earn Rs 150 crore on  its opening day | Telugu Movie News - Times of India

అయితే మహేష్ ఆ కథను రిజెక్ట్ చేశాడు. దీంతో.. అదే కథతో రణ్‌బీర్ కపూర్‌ని పెట్టి యానిమల్ సినిమా చేశాడని అంతా భావించారు. అయితే.. ఈ విషయంపై సందీప్ రెడ్డివంగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. మహేష్‌తో తాను చేయాలనుకున్న ప్రాజెక్ట్ డెవిల్ అంటూ వివరించాడు. ఇప్పుడు ఆ డెవిల్‌ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందట. నిజానికి సందీప్ రెడ్డివంగా లైన‌ప్‌లో చరణ్ లేడు. చిరంజీవితో సినిమా చేయాలని ఆయన భావించాడు. అయితే.. చిరు మాత్రం.. రామ్ చరణ్‌తో ఆ సినిమా చేయాల్సిందిగా సందీప్‌ని ఒప్పించాడని.. ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇంతకుముందు శంకర్ కూడా మొదట చిరంజీవితో సినిమా చేయాలని వస్తే.. చరణ్‌తో గేమ్ చేంజ్ సినిమా చేయాల్సి వచ్చింది. అలా.. రామ్ చరణ్‌తో సందీప్ డెవిల్ సినిమాకు ఫిక్స్ అయ్యాడని టాక్ గట్టిగా నడుస్తుంది. ఇక.. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్షన్‌లో తన 16వ‌ సినిమాల్లో చ‌ర‌ణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత.. సుకుమార్ డైరెక్షన్‌లో తను ఆర్సి17 సెట్స్‌లో అడుగు పెట్టనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే చరణ్.. సందీప్ రెడ్డివంగా కాంబోలో డెవిల్ సెట్స్‌ పైకి రానుందని టాక్.