SSMB 29: మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ..!

టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్‌లో చాటిచెప్పిన జక్కన్న.. తర్వాత వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకునే స్టేజ్‌కు తెలుగు సినిమాలు తీసుకువెళ్లాడు.

Rajamouli ignored Sridevi, But Doing It For Priyanka Chopra? | Rajamouli  ignored Sridevi, But Doing It For Priyanka Chopra?

అలాంటి రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుండడం మరో విశేషం. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదటి షెడ్యూల్ ను ప్రారంభించారు. అంతలోనే ప్రియాంక పర్సనల్ పనితో షూట్‌కు బ్రేక్ ఇవ్వడం.. అదే టైంలో జక్కన్న రిలేటివ్స్ మృతితో మరికొంతకాలం షూటింగ్‌కు గ్యాప్ వచ్చింది. అయితే.. నిన్న తాజాగా మళ్లీ రీ షూట్‌ను ప్రారంభించిన మేకర్స్‌ కొన్ని షార్ట్స్‌ను కూడా తీశారని సమాచారం. అయితే రాజమౌళి సినిమాకు సంబంధించి ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.

Mahesh Babu is closely guarding his look

మూవీ పేపర్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి.. క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు టీం. దీంతో త్వరలోనే రాజమౌళి.. మహేష్ తో కలిసి ఓ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని.. ఈ ప్రెస్‌మీట్‌లో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెల్లడించనున్నారని సమాచారం. ఈ మూవీలో ఉండే మ‌రోకీలక అప్డేట్.. సినిమాకు హైప్‌ను ఇచ్చే మ్యాటర్ మహాశివరాత్రి నాడు.. ఆడియన్స్ కు రివీల్ చేయనున్నాడట. ఈ మూవీలో నటించే బాలీవుడ్, హాలీవుడ్ తారాగణంతోపాటు.. మరేదో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా రివిల్ చేయనున్నారట. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. మహేష్, రాజమౌళి కలిసి ప్రెస్ మీట్ పెట్టారంటే మాత్రం ఫ్యాన్స్‌కు అది బిగ్ గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. ఇక ఈ వార్త తెలియగానే సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రాజమౌళి చెబుతాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.