తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడుపాదుల వయసులోనూ తన స్టైల్, యాటిట్యూడ్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ మంచి ఫామ్‌లో రాణిస్తున్న రజనీకాంత్.. తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. రజనీకాంత్ కెరీర్ స్టార్టింగ్‌లో మాంసాహారం తినడానికి ఎక్కువగా ఇష్టపడేవారట. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కువగా శాఖాహారం తినేవారని.. దీంతో వాళ్ళ ఇంట్లో శాకాహార వంటలు మాత్రమే ఉండేవని సమాచారం. అయితే రజనికి మాంసాహారం ఇష్టం. దీనితో తాను మాంసాహారం తినడానికి ప్రత్యేకంగా స్నేహితులు ఉండేవారట. అలా రజినీకి అంత సన్నిహితంగా ఉండే కొంతమంది ఆయన నాన్ వెజ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసన్నిహితుల్లో ముత్తప్ప ఒకడు.
ఆయన ఏవీఎం స్టూడియోలో పనిచేశారు. చాలా సంవత్సరాలు రజనీకి పర్సనల్ మేకప్ మ్యాన్‌గాను వ్యవహరించాడు. ఇక ముత్తప్ప ఇల్లు వడపళానిలో ఉండేదట. రజిని ఎప్పుడెప్పుడు చేపల కూర తినాలనిపించిన.. అప్పుడు ముత్తప్పా ఇంటికి వెళ్ళిపోయేవాడట. ఎక్కువగా రాత్రి సమయంలోనే ఎవరు గుర్తుపట్టకుండా ఓ చిన్న కారులో సాధారణ వ్యక్తిలా.. ముఖ్యంగా ఏదో ఒక మారువేషంలో వాళ్ళ ఇంటికి వెళ్లి పోయేవాడట. వాళ్ళింట్లో చాపల కూర ఇష్టంగా ఆస్వాదిస్తాడట రజని. అదేవిధంగా.. ముత్తప్ప భార్య చేసే తలకాయ కూర కూడా రజనికి ఫేవరెట్ ఫుడ్. అంతేకాదు మేక కుడుం కూడా రజిని ఇష్టంగా తినేవాడట. ఎప్పుడు మాంసాహారం తినాలనిపించిన.. వెంటనే ముతప్పకు చెప్పేసేవాడట. అలా సూపర్ స్టార్ కు మాంసాహారం తినాలనిపించినప్పుడల్లా.. కడుపునిండా పెట్టిన ముత్తప్ప 2018 లో చనిపోయారు.
ఇక ముత్తప్పలానే రజనీకి ఆహార విషయంలో మరి కొంతమంది స్నేహితులు ఉండేవారు. రజినీకి నీలంగరై దాటిన తర్వాత ఓ బంగ్లా ఉండేదట. సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకుని చెన్నై తిరిగి వచ్చిన తర్వాత.. నిలంగరై గెస్ట్ హౌస్‌లో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న రజినీకాంత్.. అక్కడే కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఇక తన బంగ్లా వెనుక ఓ గుడిసి ఉండేదని.. అక్కడ ఉన్న వారితోను ఆయన చాలా సాధారణంగా మాట్లాడే వారిని సమాచారం. అలాంటి పరిచయంతోనే ఆ గుడిసె ఇంటిలో ఉండే వ్యక్తితో స్నేహం కుదిరింది. ఎండు చేపల కూర చేసి పెట్టమని అతన్ని అడిగి మరీ రజనీకాంత్ తినేవాడట. అంతే కాదు రజినీకాంత్ కి ఎండు చేపలంటే ఎంత ఇష్టమో.. తన పాత ఇంటర్వ్యూల్లో ఆయన స్వయంగా వెల్లడించారు. అలా రజినీకాంత్ కు మాంసాహారం అందించే స్నేహితులు చాలా మంది ఉన్నారట. అయితే ఇంతటి మాంసాహార ప్రియుడైన రజిని ఒకానొక టైంలో తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాంసాహారానికి పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం ఇష్టమైన ఆహారాలన్నీ కూరగాయలే. అందులోను సాలార్లు ఎక్కువగా తింటూ ఉంటాడు రజిని.