టాలీవుడ్ స్టార్ నటి.. మాజీ మంత్రి రోజాకు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు. ఈ క్రమంలోనే రోజా కూడా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే.. రాజకీయాల్లో మంత్రిగా సక్సెస్ కాకముందు.. స్మాల్ స్క్రీన్ పై రోజా చేసిన హంగామా తెలిసిందే. జబర్దస్త్‌తో పాటు.. పలు షోలలో సందడి చేసిన ఈ అమ్మడు.. మంత్రైన తర్వాత స్మాల్ స్క్రీన్ కు మెల్లమెల్లగా దూరమైంది. గత ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో.. జబర్దస్త్ కూడా వదిలేసి టీవీ షోలు, సినిమాలు చేయను.. ప్రజలకే నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో.. రోజా కూడా చాలా వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి బుల్లితెర ఎంట్రీ కి సిద్ధమైంది రోజా. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4లో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయినట్లు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ షోలో.. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి జడ్జ్‌లుగా వ్యవహరించనునట్లు సమాచారం. కాగా.. షో మార్చి 2 ఆదివారం.. సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. రవి, అషూరెడ్డి యాంకర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ షోపై ప్రస్తుతం ఆడియన్స్‌లో హైప్ నెలకొంది. ఇక మరో నాలుగేళ్లపాటు ఆంధ్రాలో ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది. కనుక.. ఎన్నికల వరకు రోజా మేడం ఫుల్ ఖాళీ.
ఈ క్రమంలోనే బుల్లితెరపై బిజీ కావడానికి సిద్ధమైందట రోజా. ఒకప్పుడు.. జబర్దస్త్‌లో నాగబాబు, రోజా జడ్జ్‌లుగా వ్యవహరించిన తర్వాత.. ఎవరు ఆరెంజ్ పిక్స్ జడ్జ్‌లు కనిపించిందే లేదు. కొన్ని.. కొన్ని వారాలు.. ఒక్కో సెలబ్రిటీ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకర్తల్లో బిజీగా ఉన్న నాగబాబు.. ఇప్పట్లో మళ్ళీ బుల్లితెరపై కనిపించే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే రోజా రీ ఎంట్రీతో ఓ వర్గం ఆడియన్స్‌కు ఇది ఆనందాన్ని కల్పిస్తుంటే.. మరి కొంతమంది నెటిజన్స్ మాత్రం.. రాజకీయాల్లో ఖాళీ ఉండటంతో రీఎంట్రి ఇచ్చింది.. ఇక్కడ సంపాదించుకోవచ్చని స్వార్థం రోజది అంటూ.. కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది షో నాశనం.. ఐరన్ లెగ్ ఎంట్రీ ఇచ్చింది.. రోజాను బ్యాన్ చేయాలి అంటూ రకరకాలుగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.