సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో తాము క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా భోజ్ పూరిలో.. స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్షర సింగ్ కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం భోజ్‌పూరిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న అక్షరా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన కృషితో స్టార్‌డంను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.7 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. భోజ్‌పూరి నటుడు పవన్ సింగ్ తో చాలాకాలం ప్రేమలో ఉంది. అయితే తర్వాత ఏవో కారణాలతో ఈ జంట విడిపోయారు.
అయితే తర్వాత జరిగిన ఎన్నో ఇంటర్వ్యూలో అక్షర పవన్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భోజ్‌పురిలో కాస్టింగ్ కోచ్ ఎలా ఉంటుందో.. తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో వివరించింది. ప్రతి రంగంలోనూ దోపిడీ కచ్చితంగా ఉంటుందని.. కేవలం సినీ రంగం గురించి మీరు మాట్లాడితే మీ ఇష్టం.. ఇండస్ట్రీలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంటే.. ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే చాలామంది రాజీ పడేదారిని ఎంచుకుంటారని.. అసలు వారంతా ఎందుకు రాజీ పడతారు.. అంటూ ప్రశ్నించింది.
కొంతమంది మాత్రం తమ నిర్ణయాలు అనుసరిస్తూ కఠినంగానే ఉంటారని వివరించింది. ఇక సినీ రంగంలో కాంప్రమైజ్ కాకపోతే.. అవకాశాలు రావట కదా.. అనే ప్రశ్నకు ఆమె రియాక్ట్ అవుతూ.. ఇక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదని.. ప్రత్యక్ష ప్రేమే ఉంటుందని చెప్పుకొచ్చింది. నేను ఓ వ్యక్తిని నెలకు 20 సార్లు ప్రేమించా. కానీ.. ఇద్దరం విడిపోయం. ఇప్పుడు కేవలం అమ్మాయిలపైనే అదంత పడుతుందంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడు అమ్మాయిలని నిందిస్తున్నారని, అమ్మాయిలే ఎమోషనల్ అవుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందరూ ప్రేమించబడాలని కోరుకుంటారు. ప్రేమలో పడిన ప్రతి అమ్మాయికి ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుగా ఉంటారంటు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అక్షరసింగ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.