టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఐదు పదుల వయసులోను యంగ్ హీరోలా తన అందంతో ఆకట్టుకుంటున్న మహేష్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక చివరిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తిగా రాజమౌళికి సెరెండర్ అయిపోయారు. ఎస్ఎస్ఎంబి 29 కోసం ఆయన పూర్తి సమయానికి కేటాయిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట మహేష్. అంతేకాదు తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. ఇక ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్‌లో మరింత హైప్ నెలకొంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ రానున్నాయి. ఇక మహేష్ బాబు ఫ్యామిలీ కూడా చాలామందికి సుపరిచితమే. ఇక మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని పలు సినిమాల్లోను కీలక పాత్రలో మెరిసింది. అయితే.. తాజాగా ఘట్టమనేని మంజుల కూతురు, మహేష్ బాబు మేనకోడలు జాహ్నవి స్వరూప్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి.
అమ్మడి అందం అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫోటోలో సుధీర్ బాబు కొడుకు చరిత్‌తో కలిసి మెరిసింది జాహ్నవి. ఈ క్రమంలోనే అక్క, తమ్ముళ్ళు ఇద్దరు అందంతో ఆకట్టుకుంటున్నారని.. ఇక జాహ్నవి అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. జాహ్నవి కనుక ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెడితే స్టార్ హీరోయిన్గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మహేష్ సోదరి మంజుల పలి సినిమాల్లో కీలక పాత్రలు నటించడమే కాదు.. నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తుంది. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా పోకిరితో సహా.. ఎన్నో సినిమాలకు నిర్మాతగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై తెరకెక్కించి. భారీ సక్సెస్‌లు అందుకుంది. మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.