కీర్తి సురేష్ బాటలో మరో స్టార్ బ్యూటీ.. క్లోజ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ.. ఎవరంటే..?

ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా రాణిస్తున్న వారంతా పెళ్లిళ్ల విషయంలో ట్రెండ్ మార్చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున‌ వారంతా.. ముదురు వయసులో వివాహాలు చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టేవారు. త్వరగా పెళ్లి చేసేసుకుంటే హీరోయిన్లుగా సినిమాల్లో అవకాశాలు రావనో.. లేదా పిల్లలు పుట్టిన తర్వాత బాడీ షేమింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని.. మరింకేదైనా కారణంతోనో ఇలా రకరకాల అభిప్రాయాలతో పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికి చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండా సొలో లైఫ్‌ను లీడ్‌ చేస్తూ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

ప్రస్తుతం జనరేషన్ హీరోయిన్స్ మాత్రం అలాంటి ఆలోచనలకు భయపడకుండా.. తమ లైఫ్ పార్ట్నర్ ను వెతికేసుకుంటున్నారు. త్వరగానే పెళ్లిళ్లు చేసుకుని మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వెంటవెంటనే గుడ్ న్యూస్‌లు చెప్తూ.. బిడ్డలను కన్న తర్వాత కూడా మరోసారి ఇండస్ట్రీ లోకి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మోస్ట్ పాపులర్ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న.. టాలీవుడ్ మహానటి, నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ తన ఫ్రెండ్ యాంటోనిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో ట్రెడిషనల్‌గా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందరికీ సడన్ షాక్ ఇచ్చింది.

1610 Shraddha Das Photos: Find Latest HD Images, Pictures, Stills & Pics -  Filmibeat

ఇదే టైంలో మరో టాలీవుడ్ స్టార్ బ్యూటీ త్వరలోనే తన ఫ్రెండ్‌ను వివాహం చేసుకోబోతుందని న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో తన నటన‌తో ఆకట్టుకున్న శ్రద్ధదాస్. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా మెరిసి.. మంచి పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బోల్ట్, హాట్ ఫోటో షూట్‌ల‌తో కుర్రకారును కవ్విస్తుంది. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో శ్రద్ధాదాస్ పెళ్లికి సంబంధించిన న్యూస్ బాగా వైరల్ గా మారుతుంది. తన చిన్ననాటి స్నేహితుడిని శ్రద్ధ వివాహం చేసుకోబోతుందని.. ఇప్పటికే ఇరు కుటుంబాలను ఓపించి.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని టాక్‌. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనుందట ఈ ముద్దుగుమ్మ‌.