టైటిల్: సంక్రాంతికి వస్తున్నాం
బ్యానర్: శ్రీ వెరకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: అనీల్ రావిపూడి
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రన్ టైం: 144 నిమిషాలు
రిలీజ్ డేట్: 14, జనవరి, 2025
పరిచయం:
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెరకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇక నేడు రిలీజ్ అయినా ఈ మూవీ ఇప్పటికే యూఎస్ లో ప్రీవియర్ షోలు పూర్తయ్యాయి. ఇక రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన వెంకీ మామ.. సంక్రాంతికి వస్తున్నాం ఆడియన్స్ ను ఆకట్టుకుందో లేదో.. వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్ కొట్టాడో లేదో రివ్యూ లో చూద్దాం.
కథ:
యాదగిరి దామోదర్ రాజు (వెంకటేష్) అనాధగా పెరిగి.. పోలీస్ ఉద్యోగంలో చేరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించుకుంటాడు. తన సహా ఉద్యోగి డిసిపి మీనాక్షితో ప్రేమ వ్యవహారం కొనసాగించినా వారి బంధం పెళ్లి వరకు వెళ్లదు. దాంతో భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేష్)ను వివాహం చేసుకుంటాడు. ఇదిలా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆహ్వానం మేరకు.. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ అఖిల సత్యం (అవసరాల శ్రీనివాస్)ను బీజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. అయితే అప్పటికే సస్పెండ్ అయిన రాజు.. డిసిపి మీనాక్షిలకు సత్యంను విడిపించే బాధ్యతను ఇస్తారు.
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దామోదర్ రాజు ఎందుకు సస్పెండ్ అయ్యాడు.. సత్యం ను పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేశారు.. అసలు రాజు, మీనాక్షిల పెళ్లి బ్రేకప్ కారణమేంటి.. ఏ పరిస్థితిలో భాగ్యలక్ష్మిని రాజు పెళ్లి చేసుకున్నాడు.. సత్యం కిడ్నాప్ నుంచి విడిపించేందుకు మీనాక్షి, రాజు చేసిన ఆపరేషన్ ఏంటి.. ఈ ఆపరేషన్ లో భాగ్యం ఎందుకు భాగమైంది.. ఇక భాగ్యానికి మీనాక్షి రూపంలో సవితి పోరు.. వీళ్ళిద్దరి మధ్యన రాజు సిచువేషన్.. తన పెంపుడు తండ్రి సర్వదమన్ బెనర్జీ కోసం రాజు ఎంతవరకు వెళ్ళాడు.. చివరకు సత్యం కిడ్నాప్ స్టోరీ ఎలా సుఖాంతం అయింది అనే సమాధానాలు సినిమాతో తెలుస్తాయి.
TJవిశ్లేషణ & డైరెక్షన్ :
కథ విశ్లేషణకు వస్తే పాత కథనే రెగ్యులర్, రొటీన్, కమర్షియల్ పాయింట్స్‌తో కొత్తగా చూపించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ సినిమాను తనదైన జానర్లో హాస్యంతో జోడించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనీల్ సక్సెస్ సాధించాడు. కొన్నిసార్లు జంధ్యాల మార్క్ కామెడీ కనిపించగా.. మరికొన్నిసార్లు ఎఫ్2 కు సిములర్గా అనిపించింది. అయితే వెంకీ మామ ఇమేజ్ ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఓ ఎస్టిమేషన్‌తో రాసుకున్న సీన్స్ హెలోరీయస్‌గా.. కామెడీని పండించాయి. ఎంటర్టైన్మెంట్‌తో పాటు.. యాక్షన్ కలిపి సంక్రాంతి పండుగ సంబరాన్ని.. సినీ అభిమానులకు పంచాడు అనిల్ రావిపూడి.
నటీనటుల పెర్పామెన్స్ :
ఇక నటినట్ల పర్ఫామెన్స్ కి వస్తే రాజు క్యారెక్టర్ లో వెంకటేష్ అనాధగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా, మాజీ ప్రియుడుగా, బాధ్యతగల భర్తగా, తండ్రిగా, కొడుకుగా ఇలా అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఒదిగిపోయి చేశాడు. తనదైన మేనరిజం, బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. వెంకటేష్ క్యారెక్టర్ ఎంటర్టైన్ చేసిన తీరు ఆడియస్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో రెచ్చిపోయారు. క్యారెక్టర్‌లో లీనమై ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. పమ్మి సాయి, వీటి గణేష్, వీకే నరేష్ తదితరులు తమదైన స్టైల్ లో కామెడీ పండించారు. గోదావరి యాసాలో పమ్మిసాయి.. కథను మలుపు తిప్పే పాత్రలో గణేష్ కామెడీతో ఆకట్టుకున్నారు. వెంకటేష్ కొడుకుగా నటించిన చిన్నోడు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇతర క్యారెక్టర్ లో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేసినట్లు అనిపించింది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ తో బీన్స్ సిసిరియో 100% మార్కులు కొట్టేసాడు. సినిమా రిలీజ్ కు ముందే హైప్ వచ్చింది. ఇక తెరపై పాటలను బ్యాగ్రౌండ్ స్కోర్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లాడు. సమీర్ రెడ్డి ప్రతి సీను అందంగా తెరకెక్కించాడు. గోదావరి అందాలను చక్కగా కెమెరాల్లో చిత్రీకరించారు. తమ్మి రెడ్డి ఎడిటింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోసారి దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమా అందించారు.
ప్లస్ పాయింట్స్ ( + ) :
ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్ అన్ని అంశాలు కటిపి రూపొందించడం సినిమాకు ప్లస్ పాయింట్. బీమ్ సిసి రోలియో మ్యూజిక్ హైలెట్గా నిలిచింది.
మైనస్ పాయింట్స్ ( – ) :
ఫస్ట్ ఆఫ్ సినిమా క్రేజీగా సాగితే.. సెకండ్ హాఫ్ మాత్రం కొంత సాగదీసినట్లుగా అనిపించింది. ఇక ఎక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్లే వాళ్లకు క్లైమాక్స్ కాస్త డిసపాయింట్మెంట్‌గా అనిపిస్తుంది.
ఫైనల్‌గా
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్‌ను సంతృప్తి పరుస్తుంది. సినిమా ధియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మరింత మంచి అనుభూతి కలుగుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం TJ రేటింగ్: 3 / 5