నందమూరి క్రేజీ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒక లక్ష్యంతో కొనసాగుతున్నారు. అభిమానులలో ఈ లక్ష్యం ఆసక్తిని పెంచుతుంది. ఇంతకీ వాళ్ళిద్దరి కామన్ గోల్ ఏంటో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు ముందు వరకు వరస రిజల్ట్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామయ్య వస్తావయ్య నుంచి ఊసరవెల్లి వరకు ఒక దాన్ని మించి ఒకటి వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. బాద్‌షా యావరేజ్ అనిపించుకుంది. ఇక టెంపర్ నుంచి గేరు మార్చిన తారక్ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. కథలు, దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఓవర్సీస్ ఆడియన్స్‌పై గురి పెట్టాడు. దాన్ని ఫలితంగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.
అయితే ఆర్ఆర్ఆర్ మల్టీ స్టార్ కనుక.. అది కాకుండా తారక్ సోలోగా నటించిన ఏ సినిమా కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కాలేకపోయిందని చెప్పొచ్చు. సింహాద్రి తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో తారక్ ర్యాంపేజ్ కనిపించలేదు. దేవర ఆ లోటు కొంతవరకు తీర్చిన.. పుష్ప 2 రేంజ్‌లో వెయ్యి కోట్లు దాటి ఉంటే మరింత గర్వంగా చెప్పుకునే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వర్షన్ కూడా తప్పు పట్టడానికి లేదు. ఇక తారక్ ప్రస్తుతం వార్2లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని పక్కన పెడితే ప్రశాంత్ నీల్ మూవీతో తారక్ తన లక్ష్యం చేరే అవకాశం చాలా వరకు ఉందని టాక్ నడుస్తుంది.
ఇక గతంలో బాలయ్య సినిమాలు ఒక హిట్ పడితే.. రెండు ప్లాపులుగా నిలుస్తూ ట్రోలర్స్‌కు స్టప్ కంటెంట్‌గా ఉండేవి. అలాంటిది అఖండ సినిమా నుంచి బాలయ్య కెరీర్ యూటర్న్ తీసుకుంది. అఖండ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగుసార్లు సక్సెస్‌లు అందుకున్నాడు బాలయ్య. అయితే బాలయ్య.. సీనియర్ హీరోలు చెరువు, వెంకటేష్ సాధించిన రూ.100 కోట్లకు పైగా షేర్వసూళ్లను మాత్రం అందుకోలేకపోయాడు. అలాగే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల సైతం టచ్ చేయలేకపోయాడు. అఖండ 2 తాండవంతో అది చాలా వరకు టచ్ చేసే స్కోప్ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక రూ.1000 కోట్లు, బాలయ్య రూ.200 కోట్లు షేర్లు దాటడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ వారి లక్ష్యం నెరవేరాలని.. అది తీరే మార్గం దగ్గరలోనే ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.