బుచ్చిబాబు ” డబల్ గేమ్ “.. తారక్ ప్రాజెక్ట్ లో చరణ్..!

గ్లోబ‌ల్ స్టార్‌ రాంచరణ్ హీరోగా.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కావడం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ మారింది. ఈ టైటిల్ కు, తార‌క్‌కు మధ్య సంబంధం ఉందంటూ ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకువచ్చి మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొద‌లెట్టారు. ఇంతకీ రామ్‌చరణ్ ఆర్‌సి 16 టైటిల్ ఏంటి.. బుజ్జి బాబు డబల్ గేమ్ ఆడడం ఏంటి.. తారక్‌కి ఆర్‌సి16 టైటిల్‌కి సంబంధమేంటి ఒక‌సారి చూద్దాం.. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఓ సినిమా నటించనున్నాడని.. ప్రాజెక్ట్ వర్క్ పూర్తయింది అంటూ వార్తలు అప్ప‌ట్లో తెగ వైరల్‌గా మారాయి. దీనికి జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనుంద‌ని.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమా రూపొందుతుంది అంటూ టాక్ నడిచింది.

Interesting buzz on Jr NTR-Buchi Babu's film - TeluguBulletin.com

అయితే చివరకు ఏం జరిగిందో తెలియదు కానీ తారక్ ఆ ప్రాజెక్ట్ చేయలేదు. ఇక తర్వాత బుచ్చిబాబు చరణ్‌తో మరో స్టోరీని ప్లాన్ చేస్తున్నాడని అంత అనుకున్నారు. కానీ.. అది జరగలేదు. ఆర్‌సి16 మూవీ యూనిట్ ఇప్పటికే కర్ణాటకలో షూటింగ్ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో మూడో స్కెడ్యూలను ప్రారంభించనున్నారు. ఈ షూటింగ్లో జాన్వి కూడా జాయిన్ అయింది. సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామానే కావడంతో.. న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ సినిమాకు పెద్ది టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్, బుచ్చిబాబు సనా కాంబో అనుకున్న సినిమాకు కూడా.. టైటిల్ పెద్ది అని టాక్‌ నడిచింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, జాన్విల కోసం రాసుకున్న ప్రాజెక్ట్.. తారక్‌తో చేయకుండా.. బుచ్చిబాబు చర‌ణ్‌తో అదే ప్రాజెక్టును రూపొందిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Exclusive - Here's when the first look of Ram Charan-Buchi Babu sports  drama will be out

ఈ క్రమంలోనే తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య మినీ వార్ మొదలైంది. ఇక ఓ ప్రాజెక్ట్ చేతులు మారి వేరే హీరోల‌కు వెళ‌డం కామన్. మరి ఇందులో బుచ్చిబాబు డబల్ గేమ్ ఏంటి అనుకుంటున్నారా.. బుచ్చిబాబు రూపొందించిన ఈ కథ ఓ గేమ్ ఆధారంగా రూపొందుతుంది. ఇక ఇది ప్ర‌ధానంగా రెండు ఆటల నేపథ్యంలో తెరకెక్కనుందట. ఇందులో జాన్వి కూడా మరో అథ్లెట్‌గా కనిపించనుందని టాక్. దీని ఉద్దేశ్యించే బుచ్చిబాబు అసలైన డబుల్ గేమ్ అడుతున్నాడంటూ కామెంట్లు వ్య‌క్తం అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్ సమర్పణలో.. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించ‌నున్నాడు. జాన్వి, చరణ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.