ఒకప్పుడు ఆర్జీవి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌తో రాణించాడు. అయితే గత కొంతకాలంగా నాశిరకంగా సినిమాలు తీస్తూ.. తనకున్న పేరును పోగొట్టుకొని జీరోగా మిగిలాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనలో ఉన్నటండి పశ్చాతాపం మొదలైందని.. రంగీలా, సత్య లాంటి సినిమాల తర్వాత తన స్థాయిని తగ్గించుకొని అలాంటి సినిమాలు తీయడం వల్ల విచారిస్తున్నానంటూ ఇటీవల ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే నిజంగా వర్మలో ఆ పచ్చతాపం మొదలయ్యిందని చాలామంది భావించారు. కానీ.. నిజంగా తన తప్పులు దిద్దుకుని మంచి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇటీవల సందీప్ రెడ్డివంగా కూడా మళ్లీ పాత ఆర్జీవి కనిపించేలా ఓ సినిమా తీయాలి అంటూ కోరిన సంగతి తెలిసిందే.
నిజంగానే తాను ఆ ప్రయత్నంలో ఉన్నట్లు వర్మ వెల్లడించాడు. ఈ క్రమంలో లేటెస్ట్ ట్విటర్ పోస్ట్ వర్మ అభిమానుల్లో ఆశలను మరింతగా పెంచేస్తుంది. వర్మ నిజంగానే ఒకప్పటి స్థాయిలో భారీ సినిమా తీయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. సర్కార్ లాంటి మరుపురాని సినిమా తీసిన అమితాబచ్చన్‌తో వర్మ మళ్ళీ ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. వర్మపై అమితాబ్‌కు చాలా పట్టు ఉంది. సర్కార్ తర్వాత కూడా అమితాబ్ సర్కార్ రాజ్, నిశ్శబ్ద్ లాంటి సినిమాలను వర్మతో చేశాడు. కానీ.. ఇది సక్సెస్ అందుకోలేదు. అయినప్పటికీ అమితాబ్‌కు ఇప్పటికీ వర్మ అంటే ఓ ప్రత్యేక అభిమానం ఉంది.
ఈ క్రమంలోనే వర్మ తనపై ఉన్న అభిమానాన్ని ఉపయోగించుకోవాలని అమితాబ్‌ను ప్రధాన పాత్రలో పెట్టి ఓ మల్టీ స్టారర్ తీయాలని భావిస్తున్నాడట. ఇక ఈ మల్టీ స్టారర్‌లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ను మరో హీరోగా తీసుకోవాలని చూస్తున్నట్లు.. వెంకటేష్‌ను ఇప్పటికే సినిమా కోసం సంప్రదించాడని సన్నిహిత వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో బడా బడ్జెట్‌తో ఈ సినిమా తీయాలని ఆర్జీవి ప్లాన్‌లో ఉన్నాడట. నిర్మాతను కూడా సిద్ధం చేసుకున్నాడని.. మళ్లీ తనని నమ్మి ఆయన అనుకున్న ఆర్టిస్టులు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరోసారి సినిమాతో తన సత్తా చాటుకునే పట్టుదలతో ఉన్నాడని సమాచారం. మరి వర్మ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.