బాలయ్య కొత్త సినిమాకు అనిరుధ్ మ్యూజిక్.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లోనూ వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య.. తాజాగా సంక్రాంతి బ‌రిలో డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక.. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో బాలయ్య నటించిన వీర‌సింహారెడ్డి సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి కాంబోలో మరో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడని టాక్. ఎన్టీఆర్, కొరటాల కాంబో మూవీ దేవరకు.. అనిరుధ్ అందించిన బీజియం ఏ రేంజ్‌లో సినిమాకు హైప్‌ తెచ్చిపెట్టింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తమన్ ని పక్కన పెడుతున్న బాలయ్య.. అసలేం జరిగింది..?

ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా హిట్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే బాలయ్య కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటూ వస్తున్న న్యూస్ నందమూరి అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అనిరుధ్‌ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాలయ్య మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మాస్ సినిమాలకు అనిరుధ్ బిజిఎం ఏ రేంజ్‌లో ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య సినిమాలకు థ‌మన్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. గోపీచంద్ మలినేని సినిమాకు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌ వ్యవహరిస్తుండడం విశేషం. ఇక బాలయ్య, అనిరుధ్‌ కాంబోలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక బాలయ్య ఈ సినిమా కంటే ముందు.. ఇప్పటికే హ్యాట్రిక్ స‌క్స‌స్ అందించిన బోయపాటితో మరోసారి ప‌నిచేయ‌నున్నాడు. అఖండ‌ కొనసాగింపుగా అఖండ 2కి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతోను బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొడితే.. ఇక బాలయ్య నుంచి రాబోయే ఫ్యూచర్ సినిమాలకు ఆడియన్స్‌లో ఏ రేంజ్ లో అంచనాలు పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.