టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది హీరోలకు అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. అలా సీనియర్ స్టార్ హీరోలుగా ఇప్పటికే రాణిస్తున్న వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. సంక్రాంతి విన్నర్‌గా నిలవాలని ఉద్దేశంతో.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించాడు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. భారీ సక్సెస్ అందుకుని తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమాతో వెంకీ మామకు ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టాక్ ప్రకారం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని.. అక్కడక్కడ కాస్త బోరింగ్‌గా అనిపించినా.. వెంకీ మామ కామెడీతో అది కవర్ అయిపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మూవీలో హీరోయిన్లుగా నటించిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా తమదైన స్టైల్ లో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇప్పటివరకు వరుస సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటే.. ఎనిమిదో సారి సక్సెస్ సాధించిన డైరెక్టర్గా ఇమేజెస్ సంపాదించుకుంటాడు. లేదంటే.. ఆయన హిట్ సినిమాల ట్రాక్ బ్రేక్ పడినట్లు అవుతుంది. అయితే మొదట ఈ సినిమాకు వెంకటేష్ బదులుగా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అనుకున్నారట. చిరుతో అయితే ఈ సినిమాను మరింత పెద్ద స్కేల్లో చేసేవారని అయితే.. చిరంజీవి ఆ కథను మిస్ చేసుకోవడంతో వెంకటేష్ సినిమాలో నటించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన టాక్‌తో సినిమా సూపర్ సక్సెస్ అందుకుంటే మాత్రం.. అనీల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా మరోసారి క్రేజ్ సంపాదించుకుంటాడు.