ఆ బ్లాక్ బస్టర్ రికార్డ్ కు అతి దగ్గరలో బాలయ్య.. బ్రేక్ చేస్తే ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతున్నారు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున. ఈ నలుగురు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గ‌డుస్తున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సీనియర్ హీరోలు అయినప్పటికీ తమ క్రేజ్‌ అలాగే కొనసాగిస్తూ ప్రేక్షకులను తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇక ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన నటించిన మూడు సినిమాలతో రూ.100 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Waltair Veerayya To Khaidi No. 150, Know First Day Collections Of  Chiranjeevi Last 5 Movies - News18

ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూడు సినిమాలతో రూ.100 కోట్ల షేర్ వ‌సూళ్లను సాధించిన చిరు.. నెంబర్ వన్ సీనియర్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా వెంకటేశా – అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ వందకోట్ల షేర్ వసూలు కొల్లగొట్టి సంచలనాన్ని సృష్టించాడు. ఇక సంక్రాంతి బరిలో బాలయ్య హీరోగా బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన మూవీ డాకు మహారాజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయ‌ల్ రోల్‌లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా ఇప్పటికే వందకోట్ల గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టేసింది. ఈ మూవీ లాంగ్ రాన్‌లో రూ.100 కోట్ల షేర్ వసూలు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎలాగైనా వంద కోట్లు షేర్ రాబట్టాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రికార్డును కూడా బాలయ్య టచ్ చేస్తే మాత్రం బాలయ్య ఖాతాలో కూడా రూ.100 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్స్ సొంతమవుతుంది.