సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, డైరెక్టర్లను ట్రోల్స్ చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమకంటే హీరోయిన్ క్యారెక్టర్ డామినేషన్ ఎక్కువగా ఉందని.. కథ కాస్త మారిస్తే బాగుంటుందని చెప్పేస్తారు. మరి కొంతమంది మాత్రం మొహమాటానికి పోయి.. డైరెక్టర్‌పై గౌరవంతో నటించేస్తారు.
అలా మన పాన్ ఇండియన్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, చరణ్, బన్నీ నటించిన సినిమాల విషయంలోనూ ఇదే ప్రాబ్లం ఎదురయింది. ఓ స్టార్ హీరోయిన్ కారణంగా వీళ్ళు ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్న. గతంలో ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తమన్నా హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. అలా తమన్నా రామ్ చరణ్ తో రచ్చ, జూనియర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లి, బన్నీతో బద్రీనాథ్ సినిమాల్లో నటించి హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉందని, హీరోయిన్ నటన హీరో కంటే హైలైట్ అంటూ కామెంట్లను అందుకుంది. అంతేనా డ్యాన్స్ విషయంలోనూ వాళ్ళను మించిపోయేలా ఆకట్టుకుంది. రచ్చ సినిమాల్లో సాంగ్స్ కి గిరగిరా నడుము తిప్పేసి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఊసరవెల్లికి కర్త కర్మ క్రియ అంతా తానే నడిపించింది.
బద్రీనాథ్ సినిమా పాటలు అన్నింటిలో అమ్మడి డ్యాన్స్ ఇరగదీసింది. అల్లు అర్జున్ ను మించిపోయింది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అలా మూడు సినిమాల్లో మన పాన్ ఇండియన్ స్టార్ హీరోలను డామినేట్ చేస్తూ తమన్న వాళ్లకు పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఆ సమయంలో వీళ్ళు పలు ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొన్నారు. కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వినాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కూడా డైరెక్టర్‌లపై ఫుల్ ఫైర్ అయ్యారు. అయితే అలాంటి హీరోస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంటే.. తమన్నా మాత్రం అవకాశాల కోసం సతమతమవుతున్న పరిస్థితి. ఇక ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ.