టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న నాగ చైతన్య, అఖిల్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల నాగచైతన్య.. హీరోయిన్ శోభితను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాగ్ రెండవ తనయుడు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా గతేడాది నవంబర్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జైనాబ్ రావిడ్జ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందంటూ సమాచారం. ఈ జంట ఎలాంటి హంగు, ఆర్పాటాలు లేకుండా సింపుల్ గానే తమ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట.
ఈ క్రమంలోనే పెళ్లికి కూడా లిమిటెడ్ గెస్ట్‌లు రానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే అన్న చైతన్య పెళ్లి నిర్వహించినట్లు అఖిల్ వివాహం కూడా జరగనుందని సమాచారం. మార్చి 24 న వీళ్ళ వివాహం జరగబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అక్కినేని ఫ్యామిలి ఇంకా ఆఫిసియల్ గా ప్రకటించకపోయినా.. ఈ వార్తలు నిజం అంటూ టాక్ కొనసాగుతుంది. నిజానికి చివరి నిమిషం వరకు అక్కినేని ఫ్యామిలీ వెడ్డింగ్ వెన్యూ , డేట్‌లను ఎప్పుడు బయటపెట్టేందుకు ఇష్టపడరు. మరోవైపు ఈ పెళ్లికి పలువురు భారత క్రికెటర్లు కూడా హాజరుకానున్నారట. అలాగే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరు, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల కుటుంబాలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇక అఖిల్.. ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ లాంటి బ్లాక్ బస్టర్ డైఎక్టర్ మురళీ కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తిరుపతి బ్యాక్ డ్రాప్‌తో పిరియాడికల్ డ్రామాగా తిరుపతి బ్యాక్ డ్రాప్‌తో రూపొదనుందని.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుసంధాంగా మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌లో ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు లెనిన్ టైటిల్ పరిశీలిస్తున్నారు. సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా కనిపించనుంది.