టాలీవుడ్ సీనియస్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అనిల్ రావిపూడి పక్కా అవుట్ ఫుట్‌తో చాలా వేగంగా సినిమాను పూర్తి చేసేసారు. తాజాగా దీనిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ.. పెద్ద అవుట్ పుట్ వేస్ట్ అనేది లేకుండా చాలా షార్ప్ గా కంటెంట్ తెరకెక్కించారని.. అందుకే సినిమా త్వరగా పూర్తయిందని చెప్పుకొచ్చాడు. పక్కా ప్లానింగ్ తో వెళ్లడం వల్ల ఇది సాధ్యమైందని వివరించాడు. ఇక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. బడ్జెట్ పరంగా చాలా చిన్న సినిమా అయినా.. హైప్ మాత్రం విపరీతంగా నెలకొంది.
ఇక ఈ సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను బాగా చేరువ చేసే సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఉంటుందని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ అందించనున్నాడని.. అతనికి తోడు ఐశ్వర్య, మీనాక్షి కూడా అదిరిపోయా రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అమితే తెలుగు రాష్ట్రాలలో సినిమాకు చాలా తక్కువ బిజినెస్ జరిగిందట. నైజాంలో దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఆంధ్రాలో రూ.15 కోట్లకు రైట్స్ అమ్ముడుపోయాయని.. సీడెడ్‌కు రూ.5 కోట్లకి హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీన్నిబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.50 కోట్ల కంటే కూడా తక్కువతో థియేటర్స్‌లోకి రానుంది.
ఇప్పటికే మూవీ పైన పాజిటివ్ బజ్ నెలకొంది. మినిమం బాగుందని టాక్ వస్తే చాలు.. సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకని భారీ లాభాలను సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓ పక్క వెంకీ మామ కూడా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాజమౌళి తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్ గా అనిల్‌కు మంచి పేరు ఉంది. ఈ మూవీ సక్సస్ సాధిస్తే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో.. అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొంటాయి. అది కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని సమాచారం. దిల్ రాజుకి వరుస సక్సెస్ లు ఇచ్చినా అనిల్ రావుపూడి.. దీంతో మరోసారి హిట్ ఇస్తాడో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయి ఫస్ట్ షో టాక్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.