పుష్ప గాడి దెబ్బకు బాలీవుడ్ విలవిల.. దెబ్బకు వంద సంవత్సరాల చరిత్ర గల్లంతు..!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ చరిత్ర తిరగరాసింది .. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. రిలీజ్ కు ముందే పుష్ప 2 ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది .. అలాగే మన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హైయెస్ట్ రిలీజ్ గా చరిత్ర తిరగరాసింది .. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి అన్ని ఏరియాలో కలెక్షన్స్ విషయంలో ఆల్టైం రికార్డును క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు పుష్పరాజ్‌.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్ళ బాలీవుడ్ చరిత్రలో పుష్ప 2తో అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను తన ఖాత‌లో వేసుకున్నాడు .. ఇప్పటివరకు బాలీవుడ్ సినీ చరిత్రలో పుష్ప2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల కలెక్షన్లను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప2 అరుదైన ఘన తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా బాలీవుడ్ లో ఉన్న స్త్రీ 2 మూవీ లైఫ్ టైం రాన్‌ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప రాజ్ అధిగమించాడు. ఇక వీటితో పాటు ఎంతో వేగంగా 14 రోజుల్లోనే 1500 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా .. అలాగే ముంబైలో రూ.200 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది.

2024 సంవత్సరంలో హ్యాయ్యెస్ట్‌ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు అల్లు అర్జున్. తన కెరియర్ లో పుష్ప 1న్ , పుష్ప 2 సినిమాలతో 2021 అలాగే 2024 లో బ్యాక్ టు బ్యాక్ హైయెస్ వ‌సూలు సాధించిన ఇండియన్ సినిమాల హీరోగా సరికొత్త రికార్డును అందుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో పుష్ప 2 మరిన్ని సరికొత్త రికార్డులను అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.