” విశ్వంభర ” కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మేకర్స్.. వ‌ర్కౌట్‌ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. మెగాస్టార్ సినిమా అంటే ఆడియన్స్ ఆయన నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. రొమాన్స్, సాంగ్స్ , డ్యాన్స్, ఫైట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అన్నింటిని మించిన ఫ‌న్‌ ఉండాలనుకుంటారు. అప్పుడే సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే కమర్షియల్‌గా ఆడియ‌న్స్‌ను ఆక‌ట్ట‌కుని మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాగా.. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత.. ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి చివరిగా నటించిన బోళా శంకర్ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

విశ్వంభర' టీజర్‌ తేదీని ఫిక్స్‌ చేసిన మెగాస్టార్‌ | Viswambara Movie Teaser  Release Date Locked | Sakshi

దీంతో.. చాలా కాలం గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా విశ్వంభర సినిమాను ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నాడు. ఈ సినిమా.. మొదట సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా.. గేమ్ ఛేంజర్ కోసం.. సినిమా పోస్ట్ పనిచేసుకున్నారు మేకర్స్‌. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా.. మే 9న విశ్వంభర చేయనున్నారట‌. ఇదిలా ఉంటే.. విశ్వంభ‌ర టీజర్ రిలీజ్ తర్వాత.. సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయి అంటూ టీం చెబుతున్నారు. ఇక చిరంజీవిని ఎలా అయితే ఆడియన్స్ చూడాలనుకుంటున్నారో.. చిరంజీవిని అలా ఈ సినిమాతో చూడబోతున్నారని సమాచారం. అద్భుతమైన కథనంతో సినిమాను డైరెక్టర్ వశిష్ట తీర్చిదిద్దారట.

Megastar and Vasshista Socio Fantasy film shoot starts from?

ఈ క్రమంలోనే సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న విశ్వంభ‌ర పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా చిరుకు బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సినిమాకు మే 9న‌ డేట్ ఫిక్స్ చేయడానికి మరో ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా ఉందట. చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ డేట్ మే 9 కాగా.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ సెంటిమెంట్ విశ్వంభర వర్కౌట్ అవ్వాలని ఉద్దేశంతో యూవీ క్రియేషన్స్ వారు అదే డేట్ లో మూవీ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించనున్నారట. ఇక సంబరాలు చిరంజీవి జంటగా సీనియర్ బ్యూటీ త్రిష కనిపించనుంది.