నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు .. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్నాడు బాలయ్య.. అఖండ నుంచి మొదలుపెట్టి వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య .. ఇప్పుడు డాకు మహారాజ్‌గా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న బాబీ డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ , సాంగ్స్ , గ్లింప్స్‌తో ప్రేక్షకుల అంచనాలు ఊహించిని రేంజ్ లో పెరిగాయి .. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.
పవర్ఫుల్ కథతో డాకు మహారాజ్ సినిమాను తెర్కక్కిస్తున్నాడు బాబి .. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలకృష్ణకు జంటగా మరోసారి అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది.. అలాగే మరో హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్ కూడా కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు .. డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 4న అమెరికాలోని టెక్సాస్ లో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు .. ఇక దాంతో ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్న బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈవెంట్ కి వెళ్లే అభిమానుల కోసం తెలుగు ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది .. ఆహా గోల్డ్ ను ఈ నెల చివరిలోగా సబ్ స్క్రిప్షన్ చేసుకుంటే.. డాకు మహారాజ్ ఈవెంట్‌ను లాంజ్‌లో కూర్చుని చూసే అవకాశంతో పాటు బాలకృష్ణను కలిసే అవకాశాన్ని కూడా పొందవచ్చు .. ఆహ గోల్డ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి డాకు మహారాజ్‌ను కలుసుకోండి .