ధనుష్‌పై ఫైర్ అవుతూ నయన్‌కు స్టార్ హీరోయిన్స్ సపోర్ట్.. మరి అంత నీచుడా..?

ప్రస్తుతం జనరల్ మీడియా , సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. నయనతార, ధనుష్ ఇష్యూ. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పుని వాడుకుందని.. అది కూడా ఫోన్లో తీసిన షార్ట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడం ధనుష్ అసలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో నయన్‌ కోపంగా మూడు పేజీల బహిరంగ లేఖతో ధనుష్ పై దుమ్మెత్తి పోసింది. కేవలం మూడు సెకండ్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం అభిమానులతో పాటు ప్రపంచానికి నీ బ‌ద్ధి ఇప్పుడు అర్థమవుతుందంటూ ఫైర్ అయ్యింది.

Sorry Dhanush...': Nayanthara Apologises In Viral Video After He 'Hated'  Her Work In Naanum Rowdy Dhaan - News18

పైకి ఎంత మంచి వాడిలాగో నటించే తన నిజస్వరూపం ఇదేనంటూ పోస్ట్ ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం అపోస్ట్ నెటింట‌ వైరల్‌గా మారడంతో ధనుష్ అభిమానులు నయనతార పై మండిపడుతున్నారు. అయితే చాలామంది సెలబ్రిటీస్ నయ‌న్‌కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అది కూడా ధనుష్‌తో నటించిన హీరోయిన్స్ నయనతారకు సపోర్ట్ చేయడం తో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నయనతార మూడు పేజీల పోస్ట్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. ఆ పోస్ట్ కి ధనుష్‌తో నటించిన శృతిహాసన్, ఐశ్వర్య లక్ష్మి, దియామీర్జా, ఏక్తా కపూర్, అనుపమ పరమేశ్వరన్ లాంటి స్టార్ హీరోయిన్స్ అంతా లైక్ కొడుతూ నయనతార కు సపోర్ట్ గా నిలిచారు.

దీంతో ధనుష్ కి పరోక్షంగా ఫైర్ అయినట్లు అర్థమవుతుంది. ఇంత‌మంది హీరోయిన్లు ఆయనపై పగ పట్టారంటే నిజంగానే ధనుష్ అంత నీచుడా అంటూ.. సినిమా షూటింగ్లో వారిని ఏమైనా ఇబ్బంది పెట్టారా.. లేదా నయనతారకు సపోర్ట్ చేయడం కోసమే వారు అలా లైక్ చేశారా.. అనే అంశాలపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ధనుష్ ఫ్యాన్స్‌ మాత్రం మా హీరో చేసిన దాంట్లో అసలు తప్పేమీ లేదు. నయనతార తన పెళ్లి వీడియోను జనానికి చూపించడానికి కూడా నెట్ ఫ్లిక్స్ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మేసింది. అలాంటిది ఆయన డబ్బులు పెట్టి తీసిన సినిమాకు సంబంధించిన క్లిప్ ని వాడుకుంటే ఆయన ప్రశ్నించడం తప్పా అంటూ నయన్ పై మండి ప‌డుతున్నారు.