యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తారక్ నుంచి సినిమా రావడం.. అది కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ డైరెక్షన్లో సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక దేవర పార్ట్ 1 క్లైమాక్స్ సంభందించిన ఓ న్యూస్ ఇటీవల మరింత వైరల్ గా మారుతుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల క్లైమాక్స్లను మించే రేంజ్ లో సినిమాపై మరింత హైప్ పెంచేలా పార్ట్ వన్ క్లైమాక్స్ ఉండబోతుందట. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా క్లైమాక్స్ పండగ లాంటిదని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే దేవరతో బాక్స్ ఆఫీస్ దగ్గర వజూళ్ళ సునామి ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక సినిమా రిలీజ్ కు దాదాపు పాతిక రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలైపోయాయి.
ప్రస్తుతం ఓవర్సీస్ లో రికార్డ్ బుకింగ్స్‌తో దేవర దూసుకుపోతుంది. యూఎస్ఏ ప్రీమియర్‌కు మరో 18 రోజులు సమయం ఉండగానే.. అప్పుడే 25వేల టికెట్లు అమ్ముడుపోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సేల్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. నార్త్ అమెరికా సేల్స్ చూస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్ లలో 945 షోలకు $810,048 డాలర్లు రాబట్టి.. వశుళ వర్షం కురిపిస్తుంది. టికెట్ పరంగా చూస్తే 26 కే ను మించి టికెట్లు బుక్ అయిపోయాయి. యూఎస్ఏ లో హార్ట్‌కేక్‌లా దేవర టికెట్స్ బుక్ అయిపోతున్నాయి. ఇక యూఎస్ ప్రీమియర్స్‌కు ఇంకా 18 రోజులు ఉండగా.. దేవర ఈ రేంజ్ లో బుకింగ్ సాధించడం అంటే రికార్డే. ఓవర్సీస్ మొత్తంగా $882,230 గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి ఇప్పటికే ఈ సినిమా రెబల్ స్టార్ కల్కి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ చేసింది.