టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఎంతో మంది లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న శోభన్ బాబు.. ఎన్నో పౌరాణిక సినిమాల్లో కూడా నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం లాంటి సినిమాల్లోనూ మెప్పించాడు. ఇక తాజాగా సంపూర్ణ రామాయణం షూటింగ్ గురించి ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ మాట్లాడుతూ శోభన్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివిల్ చేశాడు. మారేడుమిల్లిలో అవుట్‌డోర్ షూటింగ్ జరుగుతున్న టైంలో దగ్గర ఉన్న హోటల్లో ఉండాల్సి వచ్చేదని.. అది డిసెంబర్ నెల.. చలి ఎక్కువగా అనిపిస్తూండడంతో షూటింగ్ అవ్వగానే మూవీ యూనిట్ అంతా హోటల్ దగ్గర క్యాంప్ ఫైర్ చేసుకుని అక్కడ కాసేపు సరదాగా గడిపే వాళ్ళం.
శోభన్ బాబు హీరో కదా.. ఆయన రారేమో అని మేమంతా భావించాం. కానీ ఒకరోజు ఆయన రగ్గు కప్పుకొని సైలెంట్గా వచ్చి మాతోపాటు క్యాంప్ ఫైర్‌లో కూర్చున్నారంటూ వివరించాడు. కాసేపటి తర్వాత నన్ను పిలిచి తమ్ముడు నా రూమ్ కి వెళ్దాం రా అని ఆహ్వానించారని రూమ్ కి వెళ్ళాక.. మాటలు చెప్పుకుంటూ.. ఓ పాట పాడమన్నారని.. నేను ఓ సాంగ్ పాడా.. పాట బాగుండడంతో మళ్ళీ మళ్ళీ పాడమనేవారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతకుముందు ఎప్పుడు శోభన్ బాబు క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చేవారు కాదని.. అలాంటిది తర్వాత ప్రతిరోజు క్యాంప్ ఫైర్ దగ్గరకు రావడం ప్రారంభించారు. ఎందుకు ఈయన రోజు ఫైర్ క్యాంప్ దగ్గరకు వస్తున్నారు. పైగా నన్ను ఆయన గదికి తరచూ తీసుకెళ్తున్నారని ఆలోచించానని వివరించాడు.
తర్వాత ఆరా తీస్తే.. సినిమా టైంలో హీరోయిన్గా నటించిన చంద్రకళ ప్రతిసారి శోభన్ బాబు గారి రూమ్‌కు వెళుతూ ఉండేదని.. ఆమెకు బోర్ కొట్టినప్పుడల్లా శోభన్ బాబు గారికి వెళ్లి మాటలు చెప్పడం ప్రారంభించిందని.. రోజు అలా చేయడం అసలు బాగోదని గమనించిన శోభన్ బాబు, ఆమెను అవాయిడ్ చేయడానికి నన్ను క్యాంప్ ఫైర్ నుంచి ఆయన గదికి తీసుకు వెళ్లేవారు అని.. శోభన్ బాబు హీరోయిన్ల విషయంలో అంత నిగ్రహంగా ఉండేవారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ జయలలిత విషయంలో మాత్రం అది బెడిసి కొట్టిందని.. ఆయన ప్రేమలో పడకుండా ఉండలేకపోయారంటూ చెప్పుకొచ్చాడు.
శోభన్ బాబు.. జయలలిత డాక్టర్ బాబు సినిమాలు కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆమె షూటింగ్ కి రావడం ఒక మహారాణిలా వచ్చే వారిని.. వెంట రెండు కార్లు వచ్చేవి.. జయలలిత ఎంట్రీ ఇవ్వగానే శోభన్ బాబు గారు ఆమె పక్కన వెళ్లి కూర్చునేవారు. ఆమె అందానికి శోభన్ బాబు అంతలా ఫిదా అయిపోయారంటూ చెప్పుకొచ్చాడు. శోభన్ బాబు స్టైల్ కి జయలలిత ప్రేమలో పడకుండా ఉండలేకపోయింది అంటూ వివరించాడు. ప్రస్తుతం కానగల చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.