టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొన్న పవన్.. తాజాగా ఏపీ ఎలక్షన్స్‌లో సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్నాడు. అత్యధిక మెజారిటీతో గెలవడమే కాదు.. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలతోనే బిజీగా గడుతున్నాడు. ఇలాంటి క్రమంలో మెగా డాక్టర్ నిహారిక పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది.
తాజాగా నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. నిహారిక మాట్లాడుతూ పవన్ బాబాయ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న మాకు మాత్రం పవర్ స్టారే.. ఎన్నికల రిజల్ట్ టైం లో మేమంతా టీవీ ముందు అతుక్కుపోయాం. అమ్మ చాలా ఎమోషనల్ అయ్యింది అంటూ వివరించింది.
బాబాయ్ ఇచ్చే స్పీచ్ లు చాలా బాగుంటాయి.. అని నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తాయంటూ చెప్పుకొచ్చిన నిహారిక.. అయిన రాజకీయాల్లో ఉన్న సినిమాల్లో ఉన్న స్టార్ అంటూ వివరించింది. ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే నేను ఆయనను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక తన బాబాయ్ ఫోన్ నెంబర్ అమ్మడు ఏమని సేవ్ చేసుకుందో వివరిస్తూ.. కేకేకే అని నా ఫోన్లో బాబాయ్ ఫోన్ నెంబర్ సేవ్ చేసి ఉంటుందంటూ అంటే అర్థం కొనిదెల కళ్యాణ్ కుమార్ అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. పవన్ కళ్యాణ్ అసలు పేరు ఇదే అంటూ ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.