పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ టాలీవుడ్‌లో మరేహీరోకు లేదనటంలో సందేహంలేదు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఫ్లాప్‌లు ఎదురైన వెనకడుగు వేయకుండా స్టార్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు. అలాగే రాజకీయాల్లోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా స్ట్రాంగ్‌గా నిలబడి తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పగాలు చేపట్టి తన విధులతో బిజీగా గడుపుతున్నారు. ఎన్నో ఫెయిల్యూర్ల తర్వాత 2024 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా 100 పర్సెంట్ సక్సెస్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. పదేళ్లు వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు, సవాళ్లు ఎదుర్కున్నాడు. అయినా జనసేనాని ఇప్పటివరకు తన ఎదుర్కొన్న అన్ని విమర్శలకు ఒక్క విజయంతో సమాధానం చెప్పాడు.
ఇన్నాళ్లు అపజయాలు చూసిన ఒక్కసారి కూడా వెనకడుగు వేయకుండా స్ట్రాంగ్ గా నిలబడడం అనేది సాధారణ విషయం కాదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కష్టానికి తగ్గిన ఫలితం వచ్చినందుకు అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. మూవీస్ తీసుకుంటూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన ఆయన.. ఇలా తిరుగుతూ శ్రమిస్తూ జనం కోసం పాటుపడుతుంటే.. హేళన చేసిన వారంతా నేడు పవన్ కళ్యాణ్‌కు చేతులెత్తి దండం పెట్టే స్టేజ్‌కు ఎదిగాడు. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.
తాజాగా పవన్.. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెళ్లికి హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ఎక్కడకు వెళ్లిన 100% సీట్లు ఎలా గెలవగలిగారు అనే ప్రశ్న ఎదురవుతుందట. తాజాగా దానిపై స్పందించిన పవర్ స్టార్.. ఈ విజయం నా ఒక్కడి వల్ల కాదు.. పార్టీ నాయకులంతా ఎంతో శ్రమించారు.. జీవితంలో ఎన్నో అవమానాలను భరించారు అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్ ఓటమిపాలైన వెంటనే అసెంబ్లీలో ఉండకుండా వెళ్లిపోయాడు.. ప్రతి ఒక్కరిని ఓటమి అంతలా వణికిస్తుంది అంటూ వివరించాడు. పవన్ కేవలం తను ఒక్కడికే అన్ని శాఖలను ఎలా ఇచ్చారనే సందేహం అందరిలోనూ ఉంటుందని.. నాపై నాకు నమ్మకం, రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి.
ఇప్పుడు దానిపై నేను ఏం చెప్పదలచుకోలేదు.. పలు విధివిధానాలు ఏర్పరిచిన తర్వాత ఆ బాధ్యతల నుంచి నేనే స్వయంగా తప్పుకుంటా అంటూ పవన్ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఈ క్రమంలో పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో పవన్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తాడా అందుకే అలాంటి కామెంట్స్ చేశాడా అంటూ అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు. మరోవైపు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడేమో అందుకే ఆ విధులు కొద్దిగా రోజులు ఎవరికైనా అప్పజెప్పి.. సినిమాలు పూర్తి చేస్తారు. కనుక అలా చెప్పి ఉంటారు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.