మరో సినిమాను వదిలేసిన ప్రశాంత్ వర్మ.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదే..?!

తీసినవి నాలుగే సినిమాలైనా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవల తేజ సజ్జా హీరోగా వ‌చ్చిన‌ హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్ డైరెక్ష‌న్‌లో సినిమా నటించేందుకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఒకటి అనౌన్స్ చేసి చాలా రోజులైనా అది ఇప్పుడు ప్రశాంత్ వర్మ వదిలేస్తున్నాడు అంటూ తెలుస్తుంది. ఇంకొకటి అనౌన్స్మెంట్ ముందే ఆగిపోయింది. దీంతో ఆ డైరెక్టర్ విషయంలో ఏం జరుగుతుంది.. అసలు ఆయన ప్లాన్ ఏంటి అనే అంశం చర్చినియాంశంగా మారింది.

ADHIRA-First Strike Launch Video | PrasanthVarma | Kalyan Dasari |  PrimeShow Entertainment

అస్సలు ప్రశాంత్ వర్మ సినిమాలు ఎందుకు చేతులు మారుతున్నాయి.. అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఆ! సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబిరెడ్డి సినిమాలు తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అతి తక్కువ బడ్జెట్ తో విజువల్ వండర్‌లా ఈ సినిమాను తెర‌కెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ ఇప్పుడు ఏదో ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. వరుసగా రెండు సినిమాలను ఆయన దూరం పెట్టినట్లు సమాచారం. అయితే ఇటీవల ఓ సినిమాను ఆయన వదిలేసినట్లు అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ వచ్చింది.

Adhira (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఇప్పుడు మరో సినిమా కూడా వదిలేస్తున్నట్లు అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈసారి సమరస్య పూర్వకంగా మార్పు జరుగుతుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో అధిరా అనే మూవీని ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. డివీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి హీరోగా ఈ సినిమాను మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఈవెంట్ జరిపారు. ఈ సినిమా గురించి ఇటీవల ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే అధిరా బాధ్యతను నా సామి రంగ డైరెక్టర్ విజయ్‌బెనికి అప్పగించేసారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్.. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ఇదంతా ఓకే కానీ ప్రశాంత్ వర్మ ఇలా వరుసగా సినిమాలను వదిలేసుకోవడం అందరికీ షాక్ ఇస్తుంది.